శ్రీవారికి వైభవంగా పుష్పయాగం | - | Sakshi
Sakshi News home page

శ్రీవారికి వైభవంగా పుష్పయాగం

Mar 27 2026 9:20 AM | Updated on Mar 27 2026 9:20 AM

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం స్వామికి సుప్రభాత సేవ, పంచామృతంతో అభిషేకం నిర్వహించాక స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించారు. ఆతర్వాత పద్మావతి, అలివేలు మంగ సమేత వేంకటేశ్వరస్వామికి 11 రకాల పూలతో పుష్పయాగంతో పాటు నిత్యకల్యాణం, పల్లకీసేవగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఆలయ ఈఓ జగన్మోన్‌రావు, చైర్మన్‌ ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ముఖ్య అర్చకులు మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement