ఏకతాటిపైకి కేఎంసీ ఉద్యోగులు | - | Sakshi
Sakshi News home page

ఏకతాటిపైకి కేఎంసీ ఉద్యోగులు

Mar 27 2026 9:20 AM | Updated on Mar 27 2026 9:20 AM

ఖమ్మం సహకారనగర్‌: ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులను ఏక తాటిపైకి తీసుకొస్తామని టీజేఏసీ జిల్లా చైర్మన్‌, టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఖమ్మంటీఎన్జీవోస్‌ భవన్‌లో అన్ని ఉద్యోగ సంఘాల మద్దతుతో గురువారం కార్పొరేషన్‌ ఉద్యోగ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. సమస్యల పరిష్కారం కోసం కేఎంసీలోని 1,200మంది ఉద్యోగులతో జేఏసీ ఏర్పాటుకు చర్చించామని తెలిపారు. కాగా, కొందరు కార్పొరేటర్లు తమకు తెలియకుండా తీర్మానం కాపీలపై సంతకాలు సేకరించారని పలువురు ఉద్యోగ సంఘాల నేతల వద్ద చెప్పగా, ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్తామని నేతలు వెల్లడించారన్నారు. టీఎన్జీవోస్‌, టీజీవోస్‌ జిల్లా కార్యదర్శులు కొణిదన శ్రీనివాస్‌, మోదుగు వేలాద్రి, నాయకులు తాళ్లూరి శ్రీకాంత్‌, సుధాకర్‌, శ్రీనివాస్‌, బిక్కు, రమణ, బుర్రి వెంకటేశ్వర్లు, వెంకటలక్ష్మి, నాగేశ్వరరావు, హేమంత్‌, కవిత పాల్గొన్నారు.

టీజేఏసీ జిల్లా చైర్మన్‌ శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement