సీఎం టూర్‌ ఇలా.. | - | Sakshi
Sakshi News home page

సీఎం టూర్‌ ఇలా..

Mar 27 2026 9:20 AM | Updated on Mar 27 2026 9:20 AM

భద్రాచలం: శ్రీ సీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం భద్రాచలం రానున్నారు. మూడు గంటల పది నిమిషాలపాటు సీఎం జిల్లాలో పర్యటించనున్నారు. కల్యాణ వేడుకల్లో పాల్గొనడంతో పాటు ఆలయ విస్తరణ, పుష్కర ఘాట్ల విస్తరణ పనులకు భూమిపూజ చేయనున్నారు. ఉదయం 9గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 10–10 గంటలకు సారపాక పాఠశాలలోని హెలిప్యాడ్‌లో దిగుతారు. అనంతరం ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత 10–40 గంటల నుంచి 11గంటల వరకు దైవదర్శనం చేసుకుంటారు. ఉదయం 11–05 నుంచి 11–30 గంటల వరకు అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు. ఆ తర్వాత 11–35నుంచి మధ్యాహ్నం 12–25 వరకు కల్యాణ వేడుకల్లో పాల్గొంటారు. ఆపై మధ్యాహ్నం 12–35 గంటలకు గెస్ట్‌హౌస్‌కు వెళ్లి.. 1–20 గంటలకు హెలిప్యాడ్‌ నుంచి హైదరాబాద్‌ బయల్దేరతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement