అక్రమ ఓట్ల తొలగింపే లక్ష్యం
ఖమ్మం మామిళ్లగూడెం: జాబితా నుంచి అక్రమ ఓట్లను తొలగించి, పారదర్శకమైన ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం పనిచేస్తోందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు స్పష్టం చేశారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా పదాధికా రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితాలో విదేశీ చొరబాటుదారులకు చోటు దక్కితే దేశ భద్రతకు ముప్పు ఎదురుకానున్నందున తొలగింపు చేపట్టినట్లు తెలిపారు. ఈవీఎంలపై గతంలో మౌనంగా ఉండి, ఇప్పుడు ఆరోపణలు చేయడం ప్రతిపక్షాల వైఖరికి నిదర్శనమని తెలిపారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘంపై విమర్శలు సరికాదని సూచించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, జిల్లా ఇన్‌చార్జి బద్ధం మహిపాల్‌రెడ్డి, నాయకులు సన్నె ఉదయప్రతాప్, గుత్తా వెంకటేశ్వరరావు, రాఘవరావు, ప్రవీణ్‌కుమార్, సుదర్శన్ మిశ్రా, రవి, నకిరేకంటి వీరభద్రం, వీరవెల్లి రాజేష్‌గుప్త, రజినీరెడ్డి, నెల్లూరి బెనర్జీ, కందుల శ్రీకృష్ణ, బి.సురేష్, సుబ్బారావు పాల్గొన్నారు.


