సైన్స్‌ ఫేర్‌కు రెడీ | - | Sakshi
Sakshi News home page

సైన్స్‌ ఫేర్‌కు రెడీ

Dec 20 2025 7:38 AM | Updated on Dec 20 2025 7:38 AM

సైన్స

సైన్స్‌ ఫేర్‌కు రెడీ

10లో ● పలువురి తరఫున విచ్చలవిడిగా ఖర్చు ● ఓడిపోయిన అభ్యర్థుల నుంచి మంత్రి తుమ్మలకు ఫిర్యాదులు

న్యూస్‌రీల్‌

మొత్తం 565 స్థానాలకు 297 జీపీల్లో విజయం పల్లె నుంచి ౖపైపెకి ఎదుగుతామంటున్న మహిళలు

రండి.. దయ చేయండి
సురక్షితంగా గమ్యానికి చేరుస్తాం.. హ్యాపీ జర్నీ అంటూ ప్రయాణికులకు బస్సుల్లో ఆర్టీసీ సిబ్బంది స్వాగతం పలుకుతున్నారు.

శనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం ఇంజనీరింగ్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం ఖమ్మంలో ఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగే టీడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా మహాసభలో పాల్గొననున్న మంత్రి, సాయంత్రం ఏదులాపురంలో మండల కార్యాలయాల కాంప్లెక్స్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

యాప్‌ ద్వారానే యూరియా విక్రయాలు

వైరా: రైతులు యూరియా కోసం యాప్‌ ద్వారా మాత్రమే బుక్‌ చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. వైరా మున్సిపాలిటీ పరిధి సోమవరం, వైరా మండలం నారపనేనిపల్లిలో శుక్రవారం యాప్‌పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ రైతులు తమ స్మార్ట్‌ఫోన్లలో ఫెర్టిలైజర్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఫోన్‌ నంబర్‌ ద్వారా బుక్‌ చేసుకోవాలన్నారు. స్లాట్‌ బుక్‌ చేసుకున్న 24 గంటల్లోగా యూరియా తీసుకోకపోతే రద్దవుతుందని తెలిపారు. పట్టాదారులే కాక కౌలుదారులు, పోడు సాగుదారులు కూడా బుకింగ్‌ చేసుకోవచ్చని, తద్వారా క్యూలో నిల్చోకుండా యూరియా తీసుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఓ మయాన్‌ మంజుఖాన్‌, ఏఈఓలు వెంపటి కీర్తి, మేడా రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎరువుల వినియోగంపై శిక్షణ

‘పీఎం ప్రణమ్‌’ కార్యక్రమంలో వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఎరువుల సమతుల్య వినియోగంపై రైతులకు శుక్రవారం శిక్షణ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో మధిర వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ రుక్మిణీ దేవి, రాష్ట్రీయ కెమికల్స్‌ ఏరియా మేనేజర్‌ పురుషోత్తమసింగ్‌ ఎరువుల వినియోగంలో పాటించాల్సిన మెళకువలను వివరించారు. కేవీకే ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ టి.సుచరితాదేవి, శాస్త్రవేత్తలు డాక్టర్‌ టి.పావని, డాక్టర్‌ వి.చైతన్య, ఫణిశ్రీ పలు సూచనలు చేశారు.

విపత్తులు ఎదుర్కొనేలా ప్రణాళిక

ఖమ్మం సహకారనగర్‌: విపత్తులు ఎదురైనప్పుడు వ్యవహరించాల్సిన తీరుపై మాక్‌ ఎక్సర్‌సైజ్‌ నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సూచించారు. జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ ఆధ్వర్యాన ఎన్‌డీఎంఏ అధికారులతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు వీసీ ద్వారా హైదరాబాద్‌ నుంచి శుక్రవారం ఈ విషయమై సమీక్షించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య పాల్గొన్నారు. వీసీ అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్‌ వరదలు వచ్చినప్పుడు, పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన సమయాల్లో జరిగినప్పుడు స్పందించాల్సిన తీరుపై ముందస్తుగా మాక్‌ ఎక్సర్‌సైజ్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. డీఆర్‌ఓ ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, వివిధ శాఖల అధికారులు సన్యాసయ్య, యాకోబు, రామారావు, వెంకటేశ్వర్లు, చందన్‌కుమార్‌, శ్రీలత, వెంకటరమణ, చైతన్య జైనీ, రంజిత్‌, నరసింహారావు, రాంప్రసాద్‌, సైదులు పాల్గొన్నారు.

297 పంచాయతీలు వారివే..

ఇటీవల పల్లెస్థాయిలో కూడా మహిళలు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని సగానికి పైగా పంచాయతీల్లో మహిళా సర్పంచ్‌లు కొలువుదీరారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మహిళలకు ఎక్కువ సీట్లు రిజర్వ్‌ అయ్యాయి. మొత్తం 566 జీపీలకు గాను 259 స్థానాలకు మహిళలకు రిజర్వ్‌ అయ్యాయి. ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామపంచాయతీకి ఎన్నికలు జరగకపోవడంతో మిగిలిన జీపీల్లో 297 చోట్ల మహిళలు సర్పంచ్‌లుగా గెలిచారు.

అతివలకు ప్రాధాన్యత

రాజకీయాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం దక్కుతోంది. 50 శాతం రిజర్వేషన్లు కలిసి రావడమేకాక ప్రజాసేవ చేయాలనే తపనతో అనేకమంది మహిళలు రాజకీయాలకు ఎంచుకుంటున్నారు. వీరికి తొలిదశలో గ్రామపంచాయతీ ఎన్నికలు మంచి వేదికగా నిలిచాయి. దీంతో రిజర్వేషన్‌ సంఖ్య కంటే ఎక్కువ స్థానాల్లో విజయఢంకా మోగించారు. కుటుంబ సభ్యులు, భర్త ప్రోత్సాహంతో రాజకీయ అరంగేట్రం చేసి సర్పంచ్‌లుగా గెలిచిన వారు ప్రజోపయోగ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తే రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. కాగా, అత్యధికంగా తిరుమలాయపాలెం మండలంలో 40 జీపీలు ఉంటే 22 జీపీల్లో, కూసుమంచిలో 41జీపీలకు గాను 22 జీపీల్లో, రఘునాథపాలెం మండలంలో 37 జీపీలకు 20 జీపీల్లో మహిళలు విజయం సాధించడం విశేషం.

జనరల్‌ స్థానాల్లో బీసీలు

జిల్లాలోని కొన్ని జనరల్‌ స్థానాల్లోనూ బీసీ మహిళలు విజయం సాధించారు. రఘునాథపాలెం మండలం వేపకుంట్ల జనరల్‌ స్థానం కాగా.. ఇక్కడ బీసీ మహిళ పోటీ చేసి గెలిచారు. అలాగే వైరా నియోజకవర్గంలోని జనరల్‌ స్థానాల్లో ఐదుగురు బీసీ, ముగ్గురు ఎస్టీ మహిళలు, సత్తుపల్లిలో ఇద్దరు బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ మహిళా అభ్యర్థి గెలుపొందారు. దీంతో వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు గ్రామపంచాయతీ ఎన్నికలు మంచి అవకాశాన్ని కల్పించినట్లయింది.

ఖమ్మం సహకారనగర్‌: ఖమ్మంలోని ఎస్‌ఎఫ్‌ఎస్‌ హైస్కూల్‌లో శనివారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న జిల్లా స్థాయి సైన్స్‌ ఫెయిర్‌, ఇన్‌స్పైర్‌ ఎగ్జిబిషన్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది సైన్స్‌ ఫేర్‌కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు మొత్తం 743 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, ఇన్‌స్పైర్‌ ఎగ్జిబిషన్‌కు 100 రిజిస్ట్రేషన్లు అందాయి మొత్తంగా 843 మంది విద్యార్థులు తమ ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నారు. అంతేకాక ఈసారి అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌, పీఎంసీ పాఠశాలల నుంచి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, రోబోటిక్స్‌ విభాగాల్లో ప్రత్యేక పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ చైతన్యజైనీ వెల్లడించారు.

నమోదైన ఎగ్జిబిట్లు

జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్‌ నిర్వహణకు విభాగాల వారీగా అధికారులు ఎగ్జిబిట్లను ఆహ్వానించారు. ఈమేరకు సస్టెయినబుల్‌ అగ్రికల్చర్‌ విభాగంలో 90, వ్యర్థాల నిర్వహణలో 87, గ్రీన్‌ ఎనర్జీలో85, ఎమర్జింగ్‌ టెక్నాలజీలో 143, రిక్రియేషనల్‌ మ్యాథమెటికల్‌ మోడలింగ్‌లో 64, ఆరోగ్యం – పరిశుభ్రతలో 97, నీటి సంరక్షణ విభాగంలో 69 ఎగ్జిబిట్లను విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. అలాగే, ఏఐ – రోబోటిక్స్‌లో 52, సెమినార్‌ విభాగంలో 41మంది, ఉపాధ్యాయులు 15 ఎగ్జిబిట్లు ప్రదర్శించనున్నారు. కాగా, శనివారం ఉదయం 8–30 గంటల నుంచి విద్యార్థులు ఎగ్జిబిట్‌తో రిపోర్టు చేయాలని, ఒక ఎగ్జిబిట్‌తో ఒకరికే అనుమతి ఉంటుందని డీఈఓ చైతన్యజైనీ తెలిపారు. దూరప్రాంతాల విద్యార్థులు, ఉపాధ్యాయులకు భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

కొణిజర్ల : పోటీలను ప్రారంభిస్తున్న

జిల్లా ఇన్‌చార్జ్‌ శ్రీనివాసరావు

కారేపల్లి : ఖో–ఖో పోటీలో తలపడుతున్న

విద్యార్థినులు

కొణిజర్ల/కారేపల్లి: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైనా దృష్టి సారించాలని మైనార్టీ విద్యాసంస్థల జిల్లా ఇన్‌చార్జ్‌ బి.శ్రీనివాసరావు, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి ముజాహిద్‌ సూచించారు. కొణిజర్ల మండలం అమ్మపాలెం, కారేపల్లిలోని మైనార్టీ గురుకులాల్లో ఉమ్మడి జిల్లా స్థాయి గురుకులాల బాలురు, బాలికల క్రీడాపోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. అండర్‌–14, 17 విభాగాల్లో అమ్మపాలెంలో బాలురకు, కారేపల్లిలో బాలికలకు కబడ్డీ, వాలీబాల్‌, ఖో–ఖో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు పోటీలను ప్రారంభించిన శ్రీనివాసరావు, ముజాహిద్‌ మాట్లాడుతూ క్రీడలను విద్యార్థులు తమ జీవితంలో భాగం చేసుకోవాలని తెలిపారు. తద్వారా ఉత్సాహం పెరగడమే కాక క్రీడల్లో రాణిస్తే విద్య, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. మైనార్టీ విద్యాసంస్థల ఉమ్మడి జిల్లా ఆర్‌ఎల్‌సీ ఎం.జే.అరుణకుమారి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో తర్ఫీదు పొందడం ద్వారా క్రమశిక్షణ పెరుగుతుందని తెలిపారు. పాఠశాలల ప్రిన్సిపాళ్లు ఎల్‌.జితేష్‌ సాహిల్‌, సావిత్రి, అధికారులు విజిలెన్స్‌ అధికారి కె.సీతారాములు మాట్లాడగా ఉపాధ్యాయులు శైలజ, అఖిల, సీత, అర్ఫిన్‌, బిపాషా, గీత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో మూడు విడతలుగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మహిళా ప్రజాప్రతినిధులు సత్తా చాటారు. అవకాశాన్ని అందిపుచ్చుకుని విజయఢంకా మోగించారు. జిల్లాలోని 565 గ్రామపంచాయతీలకు 297 జీపీల్లో మహిళలే సర్పంచ్‌లుగా గెలుపొందారు. పురుషుల కన్నా మహిళలు ప్రజాప్రతినిధులుగా రాణిస్తారనే అభిప్రాయం ప్రజల్లో ఉండడం.. సమస్యల పరిష్కారం, అభివృద్ధిలో మేటిగా నిలుస్తారనే నమ్మకంతోనే పట్టం కట్టినట్లు తెలుస్తోంది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తామని మహిళా ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.

– సాక్షిప్రతినిధి, ఖమ్మం

జీపీ ఎన్నికల్లో సత్తా చాటిన అతివలు

సైన్స్‌ ఫేర్‌కు రెడీ1
1/2

సైన్స్‌ ఫేర్‌కు రెడీ

సైన్స్‌ ఫేర్‌కు రెడీ2
2/2

సైన్స్‌ ఫేర్‌కు రెడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement