అక్కడక్కడా ఇక్కట్లు.. అసౌకర్యాలు
జిల్లాలోని ఏడు మండలాల్లో మూడో విడతగా గ్రామపంచాయతీ ఎన్నికలు బుధవారం ముగిశాయి. కొన్నిచోట్ల స్వల్ప ఉద్రిక్తత మినహా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. పెనుబల్లి మండలం సూరయ్యబంజరలో ఇరు అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు గుర్తులు చెబుతున్నారని గొడవ చెలరేగింది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టి బయటకు పంపించడంతో వివాదం సద్దుమణిగింది. ఇక కారేపల్లి మండలంలోని పేరుపల్లి హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో పది పోలింగ్ బూత్‌ల ఏర్పాటుకు సిద్ధం కాగా, ఎనిమిదే గదులు ఉన్నాయి.
దీంతో వరండాలో సైడ్ కర్టెన్స్ కట్టి బూత్‌లు ఏర్పాటు చేశారు. తల్లాడ
మండలం మల్లవరంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఇక కారేపల్లి
హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం ఒంటిగంటకు గేట్లు
మూసే సమయాన ఓ ఓటరు రావడంతో అనుమతించారు. కానీ ఆయన మద్యం సేవించి ఉండడంతో ‘నేను ఓటు వేయను’ అని చెబుతూ తిరిగి వెళ్లిపోయారు. అలాగే, ఏన్కూరు మండలం కోనాయపాలెంలో ఎనిమిది వార్డులకు ఏడు ఏకగ్రీవమైతే ఒకే వార్డుకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 140 మంది ఓటర్లు చాలాసేపు రాకపోవడంతో సిబ్బంది ఎదురుచూశారు. చివరకు వారు వెళ్లి నచ్చజెప్పడంతో ఓటింగ్‌కు వచ్చారు. కాగా, సత్తుపల్లి మండలం సిద్ధారంలో ఓ దివ్యాంగురాలు ఓటు వేసేందుకు రాగా సిబ్బంది వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి లోపలికి తీసుకెళ్లారు. కానీ, ఓటు వేశాక పట్టించుకోకపోవడంతో ఆమె తల్లే ఇబ్బంది పడుతూ నడిపించుకుని ఆటో వద్దకు వచ్చింది.
–సత్తుపల్లి / సత్తుపల్లిరూరల్ /
కారేపల్లి / ఏన్కూరు
అక్కడక్కడా ఇక్కట్లు.. అసౌకర్యాలు
అక్కడక్కడా ఇక్కట్లు.. అసౌకర్యాలు
అక్కడక్కడా ఇక్కట్లు.. అసౌకర్యాలు
అక్కడక్కడా ఇక్కట్లు.. అసౌకర్యాలు
అక్కడక్కడా ఇక్కట్లు.. అసౌకర్యాలు
అక్కడక్కడా ఇక్కట్లు.. అసౌకర్యాలు


