ఎంపీ పార్థసారధిరెడ్డి స్వగ్రామంలో బీఆర్‌ఎస్సే..
వేంసూరు: హెటిరో డ్రగ్స్ అధినేత, రాజ్యసభ సభ్యుడైన బండి పార్థసారధిరెడ్డి స్వగ్రామం వేంసూ రు మండలం కందుకూరులో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించాడు. ఈ గ్రామ సర్పంచ్‌గా బీఆర్‌ఎస్ బలపర్చిన మందపాటి వెంకటరెడ్డి 802 ఓట్ల మెజార్టీతో సమీప అభ్యర్థిపై గెలుపొందారు. వేంసూరు మండలంలోనే అత్యధిక మె జార్టీ ఈ గ్రామంలోనే నమోదు కావడం విశేషం.
చెన్నూరులో రూ.90 వేల నగదు స్వాధీనం
కల్లూరు/కల్లూరురూరల్: కల్లూరు మండలం చెన్నూరులో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒక నెట్ సెంటర్‌లో రూ.90 వేల నగదు లభ్యమైంది. ఈ డబ్బులు ఓటర్లకు పంచేందుకే పెట్టారని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు పరస్పరం ఆరోపించారు. దీంతో గందరగోళం ఏర్పడి ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఈ మేరకు అధికారులు నెట్‌సెంటర్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు.


