ఒక ఓటుతో వరించిన విజయం
కూసుమంచి/తిరుమలాయపాలెం: కూసుమంచి మండలంలోని జుజుల్‌రావుపేట సర్పంచ్‌గా బీఆర్‌ఎస్ మద్దతుదారుడు దాట్ల సలీమ్ ఒక్క ఓటుతో గెలుపొందాడు. కాంగ్రెస్ మద్దతుదారు దాట్ల అనూషపై తొలుత మూడు ఓట్లతో ఆయన గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ అభ్యర్థి అభ్యంతరం తెలపగా మూడు సార్లు రీకౌంటింగ్ నిర్వహించారు. చివరకు సలీమ్‌ను ఒక ఓటుతో సర్పంచ్ పదవి వరించింది.
●తిరుమలాయపాలెం మండలం తాళ్లచెరువులోనూ ఒక్క ఓటుతో బీఆర్‌ఎస్ బలపరిచిన గడుపుడి వెంకటనారాయణ సర్పంచ్‌గా విజయం సాధించారు. వెంకటనారాయణకు 312 ఓట్లు రాగా కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గడుపుడి వీరభద్రంకు 311 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వార్డుల వారీగా బీఆర్‌ఎస్‌కు 90 ఓట్ల మెజార్టీ రాగా, బీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చినా ఒక్క ఓటుతో పరాజయం పాలయ్యాడు.
●కూసుమంచి మండలం నేలపట్ల గ్రామపంచాయతీలో కూడా రీకౌంటింగ్ నిర్వహించగా కాంగ్రెస్ మద్దతుదారుడు నూకల శోభన్‌బాబు నాలుగు ఓట్లతో విజయం సాధించాడు. ఇక కూసుమంచి సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుదారు కొండా కృష్ణవేణి వేయి ఓట్ల మెజార్టీతో గెలవగా.. జీళ్లచెరువు కాంగ్రెస్ అభ్యర్థి ఐతగాని వెంకటరమణ 400పై చిలుకు ఓట్లతో విజయం సాధించింది. మునిగేపల్లిలో స్వతంత్ర అభ్యర్థి గంగా స్రవంతి 250 ఓట్లతో విజయం సాధించడం విశేషం.
ఒక ఓటుతో వరించిన విజయం


