ఎన్నికలకు భారీ బందోబస్తు
పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ సునీల్‌దత్
ఖమ్మంక్రైం: జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ మండలం కామంచికల్లు, తీర్థాల, గోళ్లపాడు, ముదిగొండ, నేలకొండపల్లి, ముజ్జుగూడెం, రాజేశ్వరపురం, కూసుమంచి, జల్లేపల్లి, దమ్మాయిగూడెం, తిరుమలాయపాలెం గ్రామాల్లో పోలింగ్‌ను సీపీ సునీల్‌దత్ పరిశీలించి భద్రతపై ఉద్యోగులకు సూచనలు చేశారు. అలాగే, ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం, కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామాల్లో సీపీ పర్యటించారు. గ్రామస్తులు చిన్నచిన్న విషయాల్లో గొడవ పడకుండా సమన్వయం పాటించాలని సూచించారు. ఇక గంధసిరి, చేగొమ్మ, చెరువుమాధారం, తల్లంపాడులో పోలింగ్ కేంద్రాలను అడిషనల్ డీసీపీ పరిశీలించారు.


