బద్ద్యాతండాలో మూడు సార్లు లెక్కింపు
రఘునాథపాలెం/సాక్షి నెట్‌వర్క్: మండలంలోని బద్ద్యాతండాలో గ్రామపంచాయతీ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ బీఆర్‌ఎస్ మద్దతు తెలిపిన పెంట్యానాయక్ 260ఓట్లు సాధించగా, కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కోటేష్‌కు 259ఓట్లు వచ్చాయి. దీంతో ఒక ఓటు మెజార్టీతో పెంట్యానాయక్ గెలిచినట్లు సాయంత్రం 4–30గంటలకు ప్రకటించే సమయాన చెల్లని ఓట్లు కూడా లెక్కించారంటూ కోటేష్ అభ్యంతరం తెలిపాడు. అక్కడ కాంగ్రెస్ – బీఆర్‌ఎస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేస్తుండడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో అధికారులు మూడు సార్లు ఓట్లు లెక్కించినా పెంట్యానాయక్‌కే ఒక ఓటు ఎక్కువ రావడం, అయినా రాత్రి 7గంటల వరకు ఫలితం వెల్లడించకపోవడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సమాచారం తెలుసుకున్న సీఐ ఉస్మాన్ షరీఫ్, ఎస్సై నరేష్ సిబ్బంది చేరుకుని పరిస్థితిని అదుపు చేయగా, పెంట్యానాయక్ విజయం సాధించినట్లు ప్రకటించారు. అక్కడకు నగర ఏసీపీ రమణమూర్తి చేరుకుని వివరాలు ఆరా తీశారు.


