నేడే తొలి పోరు | - | Sakshi
Sakshi News home page

నేడే తొలి పోరు

Dec 11 2025 8:25 AM | Updated on Dec 11 2025 8:25 AM

నేడే

నేడే తొలి పోరు

8లో

న్యూస్‌రీల్‌

ఉదయం 7 గంటలనుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్‌ మధ్యాహ్నం 2గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, వెంటనే ఫలితం సామగ్రి సహా పోలింగ్‌ కేంద్రాలకు చేరిన ఉద్యోగులు

అధికారులే కీలకం
ఎన్నికల పోలింగ్‌ సాఫీగా ముగిసేలా అధికారులు కీలకంగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్‌ శ్రీజ సూచించారు.

గురువారం శ్రీ 11 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

బ్యాలెట్‌ బాక్స్‌, సామగ్రితో పోలింగ్‌ కేంద్రాలకు వెళ్తున్న ఉద్యోగులు

టీకాలు సకాలంలో వేయించాలి

చింతకాని: పిల్లలు, గర్భిణులకు సకాలంలో టీకాలు వేయించాలని, తద్వారా ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించవచ్చని జిల్లా వ్యాక్సిన్‌ మేనేజర్‌ సీహెచ్‌.రమణ వైద్య సిబ్బందికి సూచించారు. మండలంలోని చింతకాని, రామకృష్ణాపురం, పందిళ్లపల్లి ఆరోగ్య కేంద్రాల్లో బుధవారం ఆయన వ్యాక్సినేషన్‌ను తనిఖీ చేసి మాట్లాడారు. బిడ్డకు తల్లిపాలు ప్రథమ టీకా అని, పాలతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. అలాగే, రెండేళ్ల లోపు పిల్లలను 12రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించేందుకు 11 టీకాలను వేస్తున్నట్లు తెలిపారు. ఈ టీకాల ఆవశ్యకతపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించాలని సూచించారు. మండల వైద్యాధికారి ఆల్తాఫ్‌, ఉద్యోగులు వీరేందర్‌, నాగేశ్వరరావు, రేఛల్‌రాణి తదితరులు పాల్గొన్నారు.

20, 21న జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్‌

ఖమ్మం సహకారనగర్‌: జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన(సైన్స్‌ ఫేర్‌) ఈనెల 20, 21వ తేదీల్లో బల్లేపల్లిలోని ఎస్‌ఎఫ్‌ఎస్‌ స్కూల్‌లో నిర్వహిస్తున్నట్లు డీఈఓ చైతన్య జైనీ తెలిపారు. పాఠశాలల విద్యార్థులు ఈనెల 18వ తేదీన రాత్రి 9గంటల్లోగా తమ ఎంట్రీలను గూగుల్‌ ఫారంలో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతీ పాఠశాల నుంచి ఒక థీమ్‌లో ఒకే ఎంట్రీ అనుమతిస్తామని తెలిపారు. కేవలం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ మాత్రమే ఉంటుందని, ఆఫ్‌లైన్‌ ఎంట్రీ ఉండదని వెల్లడించారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా నేరుగా ఎగ్జిబిట్‌ తీసుకొచ్చిన వారికి అనుమతి ఉండదని డీఈఓ తెలిపారు.

పల్లె దవాఖానాలో

డీఎంహెచ్‌ఓ తనిఖీ

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం ఖానాపురంలోని పల్లె దవాఖానాను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డి.రామారావు బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇమ్యూనైజేషన్‌ కార్యక్రమ అమలుపై ఆరాతీసిన ఆయన బాలింతల వద్ద ఉన్న మాతా–శిశు సంరక్షణ కార్డులను పరిశీలించారు. పిల్లలకు నిర్దేశిత సమయంలో టీకాలు వేయించాలని సూచించారు. టీకాల ఆవశ్యకతపై వైద్యులతో పాటు ఏఎన్‌ఎంలు, సిబ్బంది అవగాహన కల్పించాలని తెలిపారు. ఆతర్వాత ఆస్పత్రి ఆవరణలో పరిశీలించిన డీఎంహెచ్‌ఓ రిజిస్టర్ల నిర్వహణ, ఆన్‌లైన్‌లో వివరాల నమోదుపై సూచనలు చేశారు. పల్లె దవాఖానా వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

రామయ్యను దర్శించుకున్న పరిక్రమణ సమితి

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని గోదావరి నది పరిక్రమణ(ప్రదక్షిణ) సమితి బృందం బుధవారం దర్శించుకుంది. బృందం సభ్యులకు ఈఓ దామోదర్‌రావు, అర్చకులు స్వాగతం పలకగా, ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకున్నారు. పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంతాల ప్రదక్షిణలో భాగంగా స్వామి వారిని దర్శించుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, సాధువుల బృందం తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్‌, చింతకాని, మధిర,

ఎర్రుపాలెం మండలాల్లోని 172గ్రామపంచాయతీలు, 1,415 వార్డులకు గురువారం ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరగనుంది. అనంతరం ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించడంతో పాటు ఉపసర్పంచ్‌ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. ఎన్నికల నిర్వహణకు

కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, సీపీ సునీల్‌దత్‌ పర్యవేక్షణలో యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం

488 మంది సర్పంచ్‌ అభ్యర్థులు

మొదటి విడతలో 192గ్రామపంచాయతీలు, 1,740 వార్డుల్లో ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. గతనెల 27నుంచి 29వరకు నామినేషన్లు స్వీకరించగా సర్పంచ్‌ స్థానాలకు 1,142, వార్డులకు 4,054 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 3వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ ముగిసే నాటికి 20 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.

దీంతో గురువారం 172 గ్రామపంచాయతీలకు జరిగే ఎన్నికల్లో 488 మంది సర్పంచ్‌ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 1,740 వార్డులకు రెండు వార్డులకు నామినేషన్లు దాఖలు కాకపోగా, 323 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 1,415 వార్డులకు 3,424 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

ఏర్పాట్లు పూర్తి

గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్‌ సిబ్బంది నియామకం, సున్నితమైన పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, వెబ్‌కాస్టింగ్‌, మైక్రో అబ్జర్వర్ల నియామకం పూర్తయింది. మొదటి విడత ఎన్నికలు జరిగే 1,582 కేంద్రాల్లో లైట్లు, ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యం కల్పించారు. ఈ కేంద్రాల్లో 1,899 మంది పీఓలు, 2,321 మంది ఓపీఓలు విధులు నిర్వర్తించనున్నారు.

సామగ్రి పంపిణీ

తొలి విడత ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులకు బుధవారం సామగ్రి పంపిణీ చేశారు. మండల స్థాయిలో 20 కేంద్రాలు ఏర్పాటుచేసి బ్యాలెట్‌ బాక్స్‌లు, పత్రాలతో పాటు ఇతర సామగ్రి అందించగా ఉద్యోగులు 139 బస్సుల్లో కేంద్రాలకు సాయంత్రంకల్లా చేరుకున్నారు. రఘునాథపాలెం మండలానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను కలెక్టర్‌ అనుదీప్‌, చింతకాని, బోనకల్‌, వైరా, కొణిజర్ల, ఎర్రుపాలెంలో అదనపు కలెక్టర్‌ శ్రీజ పరిశీలించారు.

కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాట్లు

గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ముగిశాక అక్కడే ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. లెక్కింపు ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా పూర్తిచేసేలా అవసరమైన ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల్లోనే తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటుచేసి పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్స్‌లు, సామగ్రిని అందులో భద్రపర్చనున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉపసర్పంచ్‌ ఎన్నిక ఉంటుంది.

కట్టుదిట్టంగా బందోబస్తు

ఎన్నికల వేళ అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏడు మండలాల్లో 360 సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లను గుర్తించారు. సెన్సిటివ్‌ పోలింగ్‌ కేంద్రాల్లో 21మంది మైక్రోఅబ్జర్వర్లను నియమించడమే కాక వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు. అలాగే, సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లలో సాయుధ బలగాలను మోహరించారు. ఇక ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, రూట్‌ మొబైల్‌ పార్టీలు, ఐదు ఎఫ్‌ఎస్‌టీ, 15ఎస్‌ఎఫ్‌టీ బృందాల ద్వారా నిఘా పెట్టారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్న గ్రామాల్లో నామినేషన్లు దాఖలైనప్పటి నుంచే ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యాన పర్యవేక్షిస్తున్నారు.

172 జీపీలు, 1,415 వార్డుల్లో ఎన్నికలు

నేడే తొలి పోరు1
1/5

నేడే తొలి పోరు

నేడే తొలి పోరు2
2/5

నేడే తొలి పోరు

నేడే తొలి పోరు3
3/5

నేడే తొలి పోరు

నేడే తొలి పోరు4
4/5

నేడే తొలి పోరు

నేడే తొలి పోరు5
5/5

నేడే తొలి పోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement