ఏకగ్రీవ పంచాయతీలు.. 65
ఏకగ్రీవ పంచాయతీల వివరాలు
ఏకగ్రీవ వార్డుల వివరాలు
● రెండో విడత జీపీల్లో అత్యధికం ● మిగతా చోట్ల మూడు దశల్లో ఎన్నికలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీలు, వార్డుల సంఖ్య తేలింది. మొత్తం 566 జీపీల్లో 65 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇక ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామపంచాయతీ ఎస్టీలకు రిజర్వు కాగా.. ఆ కేటగిరీ ఓటర్లు లేకపోవడంతో అక్కడ ఎన్నిక జరగడం లేదు. ఇవిపోగా 500 సర్పంచ్ స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. అలాగే, 5,168 వార్డుల్లో ఏకగ్రీవాలు, నామినేషన్లు దాఖలు కానివి మినహా 4,166 వార్డుల్లో ఎన్నిక నిర్వహించనున్నారు.
విడతల వారీగా ఇలా
●తొలి విడత : కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో తొలి విడతగా 192 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక్కడ 20 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కావడంతో 172 పంచాయతీల్లో గురువారం ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 1,740 వార్డులకు గాను 323 వార్డులు ఏకగ్రీవం కాగా, రెండు వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఈ నేపథ్యాన 1,415 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. సర్పంచ్ స్థానాలకు 488 మంది, వార్డుల్లో 3,424 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
●రెండో విడత : కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లోని 183 జీపీలకు, 1,686 వార్డులకు రెండో విడత ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించారు. ఈ దశలో ఏకగ్రీవమైన 23 సర్పంచ్ స్థానాలు పోగా మిగతా 160 జీపీల్లో ఈనెల 14న ఎన్నికలు నిర్వహించనుండగా, సర్పంచ్ స్థానాలకు 451 మంది పోటీ పడుతున్నారు. అలాగే, 306 వార్డులు ఏకగ్రీవం కాగా ఒక వార్డుకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 1,379 వార్డుల్లో జరిగే ఎన్నికల బరిలో 3,352 మంది అభ్యర్థులు ఉన్నారు.
●మూడో విడత : ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి మండలాల్లోని 191 గ్రామపంచాయతీలు, 1,742 వార్డుల్లో మూడో విడత ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక్కడ ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామపంచాయతీ ఎస్టీలకు రిజర్వ్ అయినా ఆ కేటగిరీ ఓటర్లు లేకపోవడంతో ఎన్నికకు బ్రేక్ పడింది. ఇదికాక 22 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 168 సర్పంచ్ స్థానాలకు ఈనెల 17న జరిగే ఎన్నికల్లో 485 మంది బరిలో ఉన్నారు. ఇక 1,742 వార్డులకు గాను 9వార్డులకు నామినేషన్లు రాకపోగా, 361 ఏకగ్రీవమయ్యాయి. ఇవి మినహా 1,372 వార్డుల్లో జరిగే ఎన్నికకు 3,369 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
విడత మొత్తం ఏకగ్రీవం ఎన్నికలు
జీపీలు (నామినేషన్లు జరిగేవి
దాఖలు కానివి)
మొదటి 192 20 172
రెండు 183 23 160
మూడు 191 22 (1) 168
మొత్తం 566 66 500
విడత మొత్తం ఏకగ్రీవం ఎన్నికలు
వార్డులు (నామినేషన్లు జరిగేవి
దాఖలు కానివి)
మొదటి 1,740 323 (2) 1,415
రెండు 1,686 306 (1) 1,379
మూడు 1,742 361 (9) 1,372
మొత్తం 5,168 1,002 4,166


