కలెక్టరేట్‌లో మానిటరింగ్ సెల్
● క్రిటికల్ కేంద్రాల్లో పోలింగ్‌పై ఆరా తీసేలా ఏర్పాటు ● ఏడు స్క్రీన్ల ద్వారా పోలింగ్ సరళి పరిశీలన
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుండగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ మానిటరింగ్ సెల్‌ను బుధవారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఏడు మండలాల్లో జరగనుండగా 360 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. ఆయా కేంద్రాల్లో పోలింగ్ సరళిని సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించేందుకు కలెక్టరేట్‌లో ఏడు స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. డీఆర్వో పద్మశ్రీ, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, ఈడీఎం దుర్గాప్రసాద్, టెక్నికల్ టీం సభ్యుడు హనుమాచారి తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో వసతులు
రఘునాథపాలెం: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రజలు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ఓటు వేసేలా ఉద్యోగులు పర్యవేక్షించాలని సూచించారు. రఘునాథపాలెం రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పోలింగ్, పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్సులకు సీల్ వేయడం, ఓట్ల లెక్కింపు, సర్పంచ్‌లకు ఎన్నిక పత్రాలు ఇచ్చే విషయంలో పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, కూర్చునే సౌకర్యాలు కల్పించడమే కాక ప్రత్యేక అవసరాలు ఉన్న ఓటర్లకు సహాయంగా నివాలని సూచించారు. ఖమ్మం ఆర్‌డీఓ జి.నరసింహారావు, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ ఆశోక్‌కుమార్, ఎంపీఓ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో మానిటరింగ్ సెల్


