ఎన్నికల నిర్వహణలో అధికారులే కీలకం
కొణిజర్ల/వైరా/చింతకాని/బోనకల్/ఎర్రుపాలెం: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో అఽధికారుల పాత్ర కీలకమని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ పేర్కొన్నారు. మొదటి దశగా గురువారం ఎన్నికలు జరగనున్న కొణిజర్ల, వైరా, చింతకాని, బోనకల్, ఎర్రుపాలెం మండలాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సామగ్రి పంపిణీపై సూచనలు చేసిన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పూర్తిస్థాయి సామగ్రితో ఉద్యోగులను పోలింగ్ కేంద్రాల చేర్చడంతో పాటు లెక్కింపు పూర్తయ్యాక తిరిగి వచ్చేలా రూట్ ఆఫీసర్లు బాధ్యత వహించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. కాగా, ఎర్రుపాలెం సెంటర్‌ను పరిశీలించిన అదనపు కలెక్టర్ శ్రీజ.. సిబ్బందికి భోజనాలు సమయానికి ఏర్పాటు చేయలేదని గుర్తించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సర్దిచెప్పి భోజనాలు తెప్పించగా వారు సామగ్రితో పోలింగ్ బూత్‌లకు బయలుదేరారు.
అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ


