ఉన్నత శిఖరాలు అధిరోహించండి
ఖమ్మంసహకారనగర్: బాలికలు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆకాశమే హద్దుగా ఎదగాలని జిల్లా విద్యాశాఖాధికారి చైతన్యజైనీ సూచించారు. ఎంచుకున్న రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరడం ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచిపేరు తీసుకురావాలని తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి బ్రాస్, పైప్ బ్యాండ్ పోటీల్లో బాలికల విభాగం నుంచి వైరాలోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీ విద్యార్థులు ప్రథమస్థానం సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు కాలేజీ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను డీఈఓ అభినందించారు. అంతేకాక ఈ నెల 11, 12వ తేదీల్లో జరిగే సౌత్ జోన్ పోటీల్లోనూ సత్తా చాటాలని డీఈఓతో పాటు సెక్టోరియల్ అధికారుల బృందం పెసర ప్రభాకర్‌రెడ్డి, రామకృష్ణ, రూబీ, ప్రవీణ్‌కుమార్ ఆకాంక్షించారు.


