లేఖ లేక రాస్తున్నా..
డిజిటల్ యుగం ఎంత ముందుకెళ్లినా లేఖ రాయడం అనేది భావాల్ని హృదయపూర్వకంగా వ్యక్తపరిచే అందమైన పద్ధతి. ఈ ఏడాది ‘లెటర్ టు మై రోల్ మోడల్’థీమ్‌కు విద్యార్థులు, యువత నుంచి స్పందన వస్తోంది. ఖమ్మం డివిజన్ పరిధిలోని అనేక పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. పిల్లలు ఆసక్తితో లేఖలను స్వయంగా రాసి పంపుతున్నారు. వచ్చే నెల 23న ఫలితాలు ప్రకటించి నగదు బహుమతులు అందిస్తాం. –వీరభద్ర స్వామి,
తపాలా శాఖ, సూపరింటెండెంట్, ఖమ్మం
మనసులోని భావాలకు అక్షర రూపమిస్తే అవతలివారి హృదయాలను తాకుతుంది. అందుకే చేతిరాత లేఖలు అందగానే ఆనందం వెల్లివిరుస్తుంది. ప్రజోపయోగ కార్యక్రమాలపై
ఉన్నతాధికారుల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలతో విషయ ప్రాధాన్యం పెరుగుతుంది. అయితే ఎస్‌ఎంఎస్‌లు, ఈ–మెయిల్, సోషల్ మీడియా విస్తరించిన తరుణంలో ఉత్తరాల సంస్కృతి
కనుమరుగవుతోంది. ఆ భావనలు నవతరం కూడా ఆస్వాదించేలా తపాలా శాఖ ‘ఢాయీ ఆఖర్’ పేరిట పోటీలు నిర్వహిస్తూ ఉత్తమ లేఖలకు నగదు బహుమతులను ప్రకటించింది.


