ఆస్పత్రుల్లో డీఎంహెచ్‌ఓ తనిఖీ
నేలకొండపల్లి: మండలంలోని చెరువుమాధారంతో పాటు మండల కేంద్రంలోని సీహెచ్‌సీని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి రామారావు శనివారం తనిఖీ చేశారు. తొలుత చెరువుమాధారంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయనున్న భవనంలో పనులను పరిశీలించి సూచనలు చేశారు. ఆ తర్వాత నేలకొండపల్లి సీహెచ్‌సీలో తనిఖీ చేసిన ఆయన ఉద్యోగుల హాజరు రికార్డులు, ఆపరేషన్ థియేటర్, ఫార్మ సీని పరిశీలించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. వైద్యాధికారులు కె.రాజేశ్, కవిత, సన, నాగమణి, శ్రావణ్‌కుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు.
పోలీసుల
విస్తృత తనిఖీలు
ఖమ్మంక్రైం: బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన డిసెంబర్ 6న బ్లాక్ డేగా పాటిస్తున్న నేపథ్యాన జిల్లావ్యాప్తంగా పోలీసులు శనివారం విస్తృత తనిఖీ లు చేశారు. అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు ఆధ్వర్యాన రైల్వేస్టేషన్, బస్టాండ్లు, హోటళ్లు, ఆలయాలు, షాపింగ్‌మాళ్లు తదితర రద్దీ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘట నలు జరగకుండా ము మ్మరంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో వన్‌టౌన్ సీఐ కరుణాకర్, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, ఖమ్మం రైల్వేస్టేషన్‌లో తనిఖీల సందర్భంగా కొందరు చిన్నారులు పోలీసులతో ఫొటో దిగుతామని కోరగా అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు వారితో ఫొటో దిగడంతో పాటు శ్రద్ధగా చదువుకుని ఉన్నతస్థాయికి చేరాలని సూచించారు.
సాయి ఈశ్వరాచారికి నివాళి
ఖమ్మంమామిళ్లగూడెం: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కలేదనే ఆవేదనతో బలవన్మరణానికి పాల్పడిన సాయి ఈశ్వరాచారికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు నివాళులర్పించా రు. ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్ వద్ద శనివారం కొ వ్వొత్తులు వెలిగించి నివాళులర్పించగా జాతీ య బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి మోడేపల్లి కృష్ణమాచారి మాట్లాడారు. రాజకీయ పార్టీల కుట్రలో సాయి ఈశ్వరాచారి అమరుడయ్యాడని తెలిపారు. సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగన్నబోయిన పుల్లారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మసనం శివరామకృష్ణ, నాయకులు గద్దె వెంకటరామయ్య, మల్లికార్జున్, గజ్జల శ్రీదేవి, ఇనగాల ఉపేంద్రాచారి, కృష్ణవేణి, సిద్ధు, సచ్చితానంద్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు ఉన్న వారికి మినహాయింపు ఇవ్వాలి
ఖమ్మంసహకారనగర్: ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్న వారే కాక దివ్యాంగులు, గర్భిణు లు, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటు న్న ఉద్యోగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్‌టీఎఫ్) నాయకులు కోరారు. ఎన్నికలవిధుల కేటాయింపులో సీనియర్ ఉపా ధ్యాయులకు కాకుండా జూనియర్లకు స్టేజీ–2 బాధ్యతలు అప్పగిస్తున్నారని తెలిపారు. ఇక నైనా సీనియర్ ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని, వారు పనిచేస్తున్న మండలం నుంచి సమీప ప్రాంతాల్లోనే విధులు కేటాయించాలని టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షు డు ధరావత్ రాములు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మట్టా శ్రీనివాసరావు, సింగారపు వేణు ఒక ప్రకటనలో కోరారు.
ఆస్పత్రుల్లో డీఎంహెచ్‌ఓ తనిఖీ


