పోలింగ్ సిబ్బంది కేటాయింపు
ఖమ్మంసహకారనగర్: జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో విధుల నిర్వహణకు సిబ్బంది కేటాయింపుపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేశామని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుధామరావు తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ర్యాండమైజేషన్ నిర్వహించగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధామరావు మాట్లాడుతూ ర్యాండమైజేషన్ ఆధారంగా మండలాలకు సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. 200 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలకు ఒక్కో పీఓ, ఓపీఓ, 201 – 400 ఓటర్లు ఉంటే ఒక పీఓ, ఇద్దరు ఓపీఓలు, 401 – 650మంది ఓటర్లుకు ఒక పీఓ, ముగ్గురు ఓపీఓలను కేటాయింపు పూర్తయిందని, అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి 20 శాతం సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచామని వెల్లడించారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ మొదటి విడతగా 192 జీపీల్లోని 1,740 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనుండగా, రిజర్వ్ సిబ్బంది సహా 1,899 పోలింగ్ అధికారులు, 2,321 ఓపీఓలను ఎంపిక చేశామని తెలిపారు. డీపీఓ ఆశాలత, డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, డీఈఓ చైతన్యజైనీ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
రఘునాథపాలెం: పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుధామరావు ఆదేశించారు. రఘునాథపాలెంలోని ఎంపీడీఓ కార్యాలయం, పోలింగ్ కేంద్రాలను శుక్రవారం పరిశీలించిన ఆయన కేంద్రాల్లో ఏర్పాట్లు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల నిర్వహణపై సూచనలు చేశారు. తహసీల్దార్ శ్వేత, ఆర్‌ఐ వాహిద్, ఎంపీఓ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు
సుధామరావు


