సైనిక అమరుల కుటుంబాలకు అండగా నిలుద్దాం
ఖమ్మం రాపర్తినగర్: దేశ ప్రజలంతా నిశ్చింతంగా ఉండడానికి సైనికుల త్యాగాలే కారణమని, అలాంటి సైనికుల్లో అమరులైన వారి కుటుంబాలను ఆదుకోవడం అందరూ బాధ్యతగా భావించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సైనిక కుటుంబాల సంక్షేమం కోసం సేకరించే సాయుధ దళాల పతాక దినోత్సవం నిధికి శుక్రవారం కలెక్టర్ విరాళం అందజేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించే సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం స్వచ్ఛందంగా ప్రజలు సహకరించాలని సూచించారు. సాయుధ దళాల పతాక దినోత్సవం నిధి అమరవీరుల కుటుంబాలు, గాయపడిన జవాన్లు, రిటైర్డ్ సైనికుల సంక్షేమానికి వినియోగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎం.చంద్రశేఖర్, ఈసీహెచ్‌ఎస్ ఓఐసీ వింగ్ కమాండర్ సురేంద్రతో పాటు ఎస్.అనూష, కళావాసు, వీరబాబు, సాయికుమార్, సుభానీ, కృష్ణమూర్తి, గోపాలరావు, ఎస్.ఎం.అరుణ్, హన్మంతరావు, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి


