●50ఏళ్ల చరిత్రలో తొలిసారి..
తల్లాడ మండలం బిల్లుపాడులో ఒకప్పుడు పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా కక్షలు ఉండడంతో ఏ ఎన్నిక వచ్చినా రెండు పార్టీల వారు ప్రతిష్టాత్మకంగా తీసుకునేవారు. ఈసారి గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో అంతా ఏకమై సర్పంచ్‌తో పాటు పది వార్డుస్థానాలకు ఒక్కొక్కరితోనే నామినేషన్ వేయించడం విశేషం. గ్రామంలో కొన్నేళ్ల క్రితం రెండు హత్యలతో పాటుపలుమార్లు ఘర్షణలు జరిగాయి. వీటికి స్వస్తి పలికేలా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు చర్చించుకుని కాంగ్రెస్ ప్రతిపాదించిన ఎనిక కృష్ణవేణితో సర్పంచ్‌గా నామినేషన్ వేయించడంతో పాటు పది వార్డులకు గాను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చెరో ఐదు తీసుకుని ఉపసర్పంచ్ పదవి బీఆర్‌ఎస్‌కు కేటాయించేలా ఒప్పందం కుదర్చుకున్నారు. దీంతో 50ఏళ్ల గ్రామచరిత్రలో ఈసారి పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం కానుంది.


