మరో 13 స్కూళ్లలో ఏఐ బోధన
నేలకొండపల్లి: రెండో విడతగా జిల్లాలోని మరో 13 పాఠశాలలో ఏఐ ఆధారిత బోధనకు ప్రతిపాదించినట్లు విద్యాశాఖ ఏఎంఓ పెసర ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని ముజ్జుగూడెం, సింగారెడ్డిపాలెం, నేలకొండపల్లి ప్రభుత్వ పాఠశాలలను శుక్రవారం తనిఖీ చేసిన ఆయన ఏఐ బోధనను పరిశీలించారు. కాగా, ముజ్జుగూడెం పాఠశాలలో ఇద్దరికి గాను ఒకే ఉపాధ్యాయుడు ఉండడం, ఇంకొకరు అనుమతి, సమాచారం లేకుండా గైర్హాజరైనట్లు గుర్తించారు. సమయపాలన పాటించకోవడం, 40 శాతం పనిదినాలు సెలవులో ఉన్నట్లు తెలుసుకున్న ఆయన డీఈఓకు నివేదిక ఇస్తామని తెలిపారు. ఎంఈఓ బి.చలపతిరావు, పాఠశాల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
నేలను రక్షించుకుంటేనే మనుగడ
వైరా: రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి నేల కలుషితం కాకుండా కాపాడాల్సిన అవసరముందని అధికారులు సూచించారు. వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ప్రపంచ మృతికా దినోత్సవాన్ని నిర్వహించగా కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ కె.సుచరితాదేవి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం ఆరోగ్యవంతమైన భూములు అవసరమని తెలిపారు. ఈమేరకు కలుషితమైన నేలను రక్షించుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య, ఆత్మ పీడీ బి.సరిత, వైరా ఏడీఏ కరుణశ్రీ, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ఏఓ డి.బాలప్రకాశ్ మాట్లాడగా కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ టి.పావని, డాక్టర్ వి.చైతన్య, ఫణిశ్రీ, ఏఓలు రామారావు, మంజుఖాన్ తదితరులు పాల్గొన్నారు.
మరో 13 స్కూళ్లలో ఏఐ బోధన


