బెదిరించారా.... ప్రలోభాలకు గురి చేశారా?!
నేలకొండపల్లి: పంచాయతీ ఎన్నికల సందర్భంగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైన చోట ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆరాతీస్తున్న నేపథ్యాన నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెంలో సర్పంచ్, ఎనిమిది వార్డులు ఏకగ్రీవం కాగా ఎన్నికల సంఘం ఆదేశాలతో తహసీల్దార్ వి.వెంకటేశ్వర్లు గురువారం వివరాలు సేకరించారు. ఏకగ్రీవం కావడానికి ఇతర అభ్యర్థులు, ఓటర్లను బెదిరించారా లేక ప్రలోభాలకు గురిచేశారా... తదితర విషయాలను స్థానికులతో అడిగి తెలుసుకున్నారు. అలాగే, బోదులబండ, కోరట్లగూడెం, కొంగర, ఆజయ్‌తండా, కట్టుకాచారం, అనాసాగారం, సధాశివాపురంల్లో 27 వార్డుసభ్యులు ఏకగ్రీవం కావడంతో అక్కడ కూడా విచారణ చేపట్టారు. ఓటర్ల వివరాలు, అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు. ఉద్యోగులు ఆలస్యం మధుసూదన్‌రావు, అల్లం రవికుమార్, పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు పాల్గొన్నారు.
ఏకగ్రీవాలపై ఎన్నికల సంఘం ఆరా


