6, 7వ తేదీల్లో ‘క్రెడాయ్’ ఎక్స్‌పో
ఖమ్మంమయూరిసెంటర్: ఇంటి కొనుగోలుకు ఉన్న అవకాశాలు, ఆస్తి కొనుగోలుకు రుణాలు, ఇంటి నిర్మాణ సామగ్రి వివరాలన్నీ ఒకే వేదికపై తీసుకొచ్చేలా ఎక్స్‌పో(ఆస్తుల, వాణిజ్య ప్రదర్శన) నిర్వహిస్తున్నట్లు ఖమ్మం క్రెడాయ్ అధ్యక్షుడు బండి జయకిషోర్ తెలిపారు. ఎక్స్‌పో జరగనున్న ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో గురువారం మాట్లాడారు. ఈనెల 6, 7వ తేదీల్లో జరిగే ఎక్స్‌పోకు జిల్లాతో పాటు హైదరాబాద్, ఇతర ప్రధాన పట్టణాల్లోని బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు హాజరవుతారని, బ్యాంకర్లు తాము అందించే రుణ సేవలను ప్రదర్శిస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా విక్రయదారులతో మాట్లాడొచ్చని చెప్పారు. ఈ సమావేశంలో క్రెడాయ్, ఎక్స్‌పో బాధ్యులు పెద్ది కేశవరావు, చెరుకుమల్లి వెంకటేశ్వరరావు, వేముల నగేష్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కురువెళ్ల ప్రవీణ్‌కుమార్‌తో పాటు నంబూరి ప్రసాద్, దేవభక్తుని హేమంత్, తూళ్లురి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


