జిల్లా జడ్జిని కలిసిన డీఎంహెచ్‌ఓ
ఖమ్మంలీగల్: డీఎంహెచ్‌ఓగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ డి.రామారావు బుధవారం జిల్లా జడ్జి జి.రాజగోపాల్‌ను కోర్టులో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జడ్జికి పూలమొక్క బహూకరించారు.
నానో డీఏపీ వాడకం
పెంచండి
కొణిజర్ల: ద్రవ రూపంలో ఉండే నానో డీఏపీని మొక్కజొన్న పంటపై పిచికారీ చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య రైతులకు సూచించారు. మండలంలోని తనికెళ్లలో నానో డీఏపీ పిచికారీ విధానంపై కోరమాండల్ కంపెనీ ప్రతినిధులు క్షేత్ర ప్రదర్శన నిర్వహించగా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ మొక్కజొన్న వేసిన 25 రోజుల తర్వాత 15 రోజులకోసారి చొప్పున రెండు సార్లు నానో డీఏపీ పిచికారీ చేసుకోవాలని సూచించారు. మందు అకులపై పడేలా పిచికారీ చేయడంతో పత్ర రంద్రాల ద్వారా మొక్క లోపలికి చేరి పోషకాలు అందజేస్తుందన్నారు. ఈ మందు వాడకంతో డబ్బుతో పాటు సమయం ఆదా అవుతాయని చెప్పారు. కార్యక్రమంలో టెక్నికల్ ఎంఏఓ పవన్‌కుమార్, కొణిజర్ల ఏఓ డి. బాలాజీ, కంపెనీ జోనల్ మేనేజర్ సుమన్, మార్కెటింగ్ మేనేజర్ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాథమిక పాఠశాలలో తనిఖీ
బోనకల్: మండలంలోని చొప్పకట్లపాలెం ప్రాథమిక పాఠశాలను మండల ప్రత్యేకాధికారి, జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ కె.విజయ భాస్కర్‌రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. విద్యార్ధుల హాజరును పరిశీలించారు. ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ ప్రోగ్రామ్‌పై ఆరా తీయగా 80 నుంచి 90 శాతం మంది విద్యార్థులు చదువుతున్నారని ఉపాధ్యాయులు వివరించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించగా, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ దామాల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా జడ్జిని కలిసిన డీఎంహెచ్‌ఓ
జిల్లా జడ్జిని కలిసిన డీఎంహెచ్‌ఓ


