●అటొక ఊరు.. ఇటు వేరు!
కూసుమంచి మండలంలోని ఈశ్వరమాధారం గ్రామం భౌగోళికంగా అంతా ఒకేలా కనిపించినా అందులో రెండు గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఓ సీసీ రోడ్డు ఈ జీపీలను విడదీస్తోంది. గతంలో ఈశ్వరమాధారం పంచాయతీ పరిధిలో ఈశ్వరమాధారం, మద్దివారిగూడెం, మందడి నర్సయ్యగూడెం, మంగళితండా, తాళ్లగడ్డతండా, రాజుపేట బజార్ గ్రామాలు ఉండేవి. ఆతర్వాత మద్దివారిగూడెం, మందడి నర్సయ్యగూడెంను విడదీసి ఒక పంచాయతీ ఏర్పాటుచేశారు. అలాగే, ఈశ్వరమాధారంలో అంతర్భాగమైన రాజుపేట బజార్‌ను రాజుపేట జీపీ నుంచి వేరుచేసి ఈశ్వరమాధారంలోని కొంతభాగం, తాళ్లగడ్డతండాను కలిపి కొత్త జీపీగా గుర్తించారు. ఇలా రాజుపేటబజార్ ఇంకో పంచాయతీలో కలిసినా భౌగోళికంగా ఈశ్వరమాధారంలో కలిసేఉంటుంది. – కూసుమంచి


