నామినేషన్ కేంద్రాల సందర్శన
తల్లాడ/కల్లూరురూరల్/సత్తుపల్లిరూరల్/వేంసూరు : సత్తుపల్లి నియోజకవర్గంలోని పలు నామినేషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ పి.శ్రీజ బుధవారం సందర్శించారు. నామినేషన్ల ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని తల్లాడలో అధికారులను ఆదేశించారు. కల్లూరు మండలం కొర్లగూడెంలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. సత్తుపల్లి మండలం కిష్టారంలో నామినేషన్ ప్రక్రియపై అధికారులతో చర్చించారు. వేంసూరు నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించాక ఆమె మాట్లాడుతూ.. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.
డీపీఓ సందర్శన..
తల్లాడ, కల్లూరు మండలం ముగ్గు వెంకటాపురం నామినేషన్ కేంద్రాలను డీపీఓ ఆశాలత పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో డీఎల్‌పీఓ విజయలక్ష్మి, ఎన్నికల పర్యవేక్షణ అధికారి వేల్పుల విజేత, తహసీల్దార్లు కరుణాకర్‌రెడ్డి, పులి సాంబశివుడు, సత్యనారాయణ, ఎంపీడీఓలు కావ్య, సురేష్ బాబు, చంద్రశేఖర్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పలుచోట్ల పర్యటించిన అదనపు కలెక్టర్ శ్రీజ


