గుర్తు తెలియని వృద్ధుడు మృతి
బోనకల్: బోనకల్‌లో బస్టాండ్‌లో గుర్తుతెలియని వృద్ధుడు(65) మంగళవారం మృతి చెందాడు. బస్టాండ్‌లో పడుకున్న ఆయన చలి తీవ్రతతో మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి మృతుడి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నట్లు ఎస్సై పి.వెంకన్న తెలిపారు.
లారీ ఢీకొని వ్యక్తి ..
ఖమ్మంరూరల్: ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఖమ్మం పంపింగ్ వెల్‌రోడ్‌కు చెందిన కూరపాటి వెంకటేశ్వర్లు(60) బట్టల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వెంకటగిరి ఏరియాలో మంగళవారం బట్టలు అమ్మిన ఆయన ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా గుర్రాలపాడు సమీపాన ఖమ్మం – కోదాడ ప్రధాన రహదారిపై వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయన భార్య జయమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్కరాజు తెలిపారు.
ఆర్‌టీసీ బస్సు ఢీకొని ఆటోడ్రైవర్..
ఖమ్మంరూరల్: ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా డ్రైవర్ మృతి చెందిన ఘటన ఏదులాపురం మున్సిపాలిటీ పరిఽధి గొల్లగూడెం వద్ద మంగళవారం రాత్రి జరిగింది. ఆటోడ్రైవర్ కుక్కల మధు(36) ఖమ్మం వైపు వెళ్లుండగా గొల్లగూడెం వద్ద ఎదురుగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మధుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా, పోలీసులు ఇచ్చిన సమాచారంతో అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు తన బృందంతో చేరుకుని మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు.
గుర్తు తెలియని వృద్ధుడు మృతి


