కేంద్రం నిధులతోనే అభివృద్ధి
ఖమ్మం మామిళ్లగూడెం: రాష్ట్రంలో అభివృద్ధి పనులన్నీ కేంద్రప్రభుత్వ నిధులు, పథకాలతోనే జరుగుతున్నాయని బీజేపీ జిల్లా ఇన్‌చార్జ్ బద్దం మహిపాల్‌రెడ్డి తెలిపారు. మోదీ హయాంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో ము గ్గురు ఉన్నా జిల్లా అభివృద్ధికి ఇచ్చిన నిధులు శూన్యమని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం డబ్బు ఇవ్వడం లేదంటే ప్రత్యర్థులను బెదిరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు సరికాదన్నారు. ఈక్రమాన ప్రతిపక్ష నాయకులు నామినేషన్ వేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కాగా, బీజేపీ నల్లగొండ ఇన్‌చార్జ్‌గా నియమితులైన పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు సన్నె ఉదయ్‌ప్రతాప్‌ను మహిపాల్‌రెడ్డి, వాసుదేవరావు, కోటేశ్వరరావు తదితరులు సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు వక్కలంక సుబ్రహ్మణ్యం, మందడపు సుబ్బారావు, గుత్తా వెంకటేశ్వర్లు, రాఘవరావు, ప్రవీణ్‌కుమార్, దొంగల సత్యనారా యణ, డాక్టర్ శీలం పాపారావు, రవిరాథోడ్, వీరల్లి రాజేష్, సుదర్శన్ మిశ్రా, దొడ్డ అరుణ, నెల్లూరి బెనర్జీ, రజినీరెడ్డి, సురేందర్‌రెడ్డి, రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


