ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా విధులు
ఖమ్మం సహకారనగర్: గ్రామ పాలన అధికారులు(జీపీఓ) ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చేలా విధులు నిర్వర్తించాలని తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తుమాటి శ్రీని వాస్ సూచించారు. ఖమ్మంలో మంగళవారం జరి గిన జీపీఓల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వాన భూభారతి చట్టాన్ని అమలుచేయడమే కాక జీపీఓల వ్యవస్థకు శ్రీకారం చు ట్టారని తెలిపారు. అనంతరం తహసీల్దార్ల సంఘం భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు కోట రవికుమార్ మాట్లాడగా జీపీఓల సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా చీమల నాగేంద్రకుమార్, ప్రధాన కార్యదర్శిగా కొత్తపల్లి బాలమురళీకృష్ణ, మహిళా విభాగం అధ్యక్షులుగా పడిగా హైమావతి, కోశాధికారిగా వజ్జా రామారావు, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మందేరుకల కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులుగా షేక్ జానీమియా, అసోసియేట్ అధ్యక్షులుగా చల్లా శ్రీనివాసరావు, మక్కాల శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. అలాగే, ఉపాధ్యక్షులుగా బానోత్ రాంచందర్‌రావు, టీ.ఎం.ఎం.కిశోర్, మల్లెంపాటి వెంకటేశ్వర్లు, కోట నరేష్, అంకోలు శ్రీలక్ష్మి, తాటి ఇందిర, కుంజ రాధారుక్మి ణి, శ్రీవాణి, బానోత్ స్వప్న, సహాయ కార్యదర్శులు గా ఆదినారాయణ, దన్నురి బాలరాజు, లకావత్ బంపర్, బానోత్ వస్రామ్‌ను ఎన్నుకున్నట్లు వెల్లడించారు.
ఏకగ్రీవంగా జీపీఓల జిల్లా నూతన కమిటీ


