కాకరవాయిలో ఉద్రిక్తత
తిరుమలాయపాలెం: మండలంలోని సోలీపురం గ్రామపంచాయతీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో గందరగోళం నెలకొంది. ఈ గ్రామపంచాయతీకి సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లను కాకరవాయి రైతు వేదికలో స్వీకరించారు. మంగళవారం చివరి తేదీ కావడంతో సాయంత్రం 5గంటల వరకు క్యూలో ఉన్న వారికి అధికారులు టోకెన్లు జారీ చేశారు. అయితే, గ్రామంలో ఎనిమిది వార్డులకు ఉండగా ఓ పార్టీకి చెందిన నాయకులు మూడు వార్డులకు నామినేషన్లు వేసే అవకాశం కోల్పోతున్నామంటూ కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు. ఇదే సమయాన ఎదుటి పార్టీ శ్రేణులు చేరుకుని నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్లు తీసుకోవద్దని డిమాండ్ చేశారు. ఇరుపార్టీల కార్యకర్తలు భారీగా చేరడంతో ఉద్రిక్తత నెలకొనగా ఎస్‌ఐ కూచిపూడి జగదీష్ వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆతర్వాత ఉద్యోగులు జిల్లా అధికారులతో మాట్లాడినట్లు సమాచారం. సమయపాలన పాటించకుండా నామినేషన్లు స్వీకరిస్తూ ఓ పార్టీ అభ్యర్థులకు అఽధికారులు సహకరిస్తున్నారని ఎదుటి పార్టీ నేతలు ఆరోపించగా.. ఆలస్యంగా వచ్చిన వారి నుంచి నామినేషన్లు స్వీకరించారా, లేదా అన్నది తెలియరాలేదు.
సమయం దాటడంతో సోలిపురం
నామినేషన్ల స్వీకరణకు నిరాకరణ


