‘స్వచ్ఛ’ విద్యాలయాలకు పురస్కారాలు
ఖమ్మంసహకారనగర్/కల్లూరు: స్వచ్ఛ హరిత విద్యాలయాలుగా ఎంపికై న పాఠశాలల హెచ్‌ఎంలకు కలెక్టర్ అనుదీప్ మంగళవారం ప్రశంసాపత్రాలు అందించారు. స్వచ్ఛ హరిత విద్యాలయాల కోసం సర్వే చేపట్టగా జిల్లాలోని 1,636 పాఠశాలలు పాల్గొన్నాయి. పాఠశాలలో తాగునీటి వసతి, టాయిలెట్ల శుభ్రత, చేతుల శుభ్రత, ప్రవర్తనలో మార్పులు, విద్యార్థుల నడవడిక తదితర అంశాల్లో 60 ప్రశ్నల ద్వారా సర్వే చేపట్టి అత్యధిక స్కోర్ సాధించిన ఎనిమిది స్కూళ్లను ఎంపిక చేశారు. కేటగిరీ–1, 2 అర్బన్ విభాగాల్లో ఎంపీపీఎస్ కొత్తగూడెం, జెడ్పీహెచ్‌ఎస్ అయ్యగారిపేట (బాలికలు), కేటగిరీ–1, 2 గ్రామీణంలో ఎంపీపీఎస్ మల్లారం, చెన్నూరు, వేపకుంట్ల పాఠశాలలతో పాటు జెడ్పీహెచ్‌ఎస్ చిన్నకొరుకొండి, పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ జల్లేపల్లి, కుర్నవల్లి పాఠశాలలు ఎంపికయ్యాయి. ఆయా స్కూళ్ల హెచ్‌ఎంలకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేయగా, డీఈఓ చైతన్యజైనీ, సీఎంఓ ప్రవీణ్‌కుమార్, ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ, ఏఎంఓ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
‘స్వచ్ఛ’ విద్యాలయాలకు పురస్కారాలు


