1959లో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఆవిర్భావం
భద్రాచలంఅర్బన్: గ్రామ పంచాయతీల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. ఇంతకీ గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎలా ఏర్పడిందో తెలుసా.? దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలో ప్రజాస్వామ్యం – సామ్యవాదం నినాదంతో దేశంలో పాలన సాగించారు. 1951లో మొదటి పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారు. ప్రొఫెసర్ ఎస్కేడే నేతృత్వంలో కమ్యూనిటీ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని అమలు చేశారు. దీనిపై శాసీ్త్రయ అధ్యయనానికి సామాజిక, ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ బల్వంత్‌రాయ్ నేతృత్వంలో అధ్యయన బృందాన్ని నియమించారు. ఈ కమిటీ ఆధారంగా 1959లో జిల్లా, బ్లాక్, గ్రామ పంచాయతీ.. మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థను దేశంలో తొలుత రాజస్థాన్‌లోని నాగౌర్‌లో అక్టోబర్ 2న ప్రారంభించగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్‌లో 1959 అక్టోబర్ 11న అప్పటి ప్రధాని నెహ్రూ ప్రారంభించారు. 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ వ్యవస్థకు చట్టబద్ధత వచ్చింది.


