నామినేషన్లు | - | Sakshi
Sakshi News home page

నామినేషన్లు

Dec 1 2025 9:30 AM | Updated on Dec 1 2025 9:30 AM

నామిన

నామినేషన్లు

● తొలివిడత 192 జీపీల్లో సర్పంచ్‌ స్థానాలకు 1,142 నామినేషన్ల దాఖలు ● 1,740 వార్డు స్థానాలకు 4,054 మంది

మండలాల వారీగా నామినేషన్ల వివరాలిలా

అత్యధికం.. రఘునాథపాలెంలో

కొన్నిచోట్ల తెల్లవారుజాము వరకూ స్వీకరణ
● తొలివిడత 192 జీపీల్లో సర్పంచ్‌ స్థానాలకు 1,142 నామినేషన్ల దాఖలు ● 1,740 వార్డు స్థానాలకు 4,054 మంది

పోటా

పోటీగా

ఖమ్మం సహకారనగర్‌: జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల సర్పంచ్‌, వార్డు స్థానాలకు హోరాహోరీగా నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడతగా ఏడు మండలాల్లోని 192 సర్పంచ్‌ స్థానాలకు 1,142 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, 1,740 వార్డు స్థానాలకు 4,054 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈసారి నామినేషన్ల ప్రక్రియ తెల్లవారుజాము వరకు కొనసాగటం గమనార్హం.

మందకొడి నుంచి.. భారీగా...

తొలి రోజు నామినేషన్ల ప్రక్రియ మందకొడిగా ఉండగా.. రెండో రోజు జోరందుకున్నాయి. మూడో రోజు మాత్రం ఎవరూ ఊహించని విధంగా అర్ధరాత్రి వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు బారులుదీరారు. శనివారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉండగా.. ఆ లోగా వచ్చిన దరఖాస్తుదారులకు అధికారులు టోకెన్లు ఇచ్చారు. వారి నుంచి నామినేషన్లు తీసుకుని కార్యక్రమం పూర్తయ్యే వరకు ఒకట్రెండు మండలాల్లో ఆదివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల వరకుపట్టింది.

ముమ్మరంగా రాజీ ప్రయత్నాలు

నామినేషన్ల ఘట్టం ముగియటంతో ప్రధాన, ప్రతిపక్ష పార్టీలు ఆయా పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు రాజీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా అధికార పార్టీకి సర్పంచ్‌ స్థానం, ఉపసర్పంచ్‌ వార్డు స్థానాలు ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి. ఈ క్రమంలో గ్రామస్థాయిలో సయోధ్య కుదరడం లేదు. దీంతో ఆయా గ్రామాలకు ఇన్‌చార్జీలుగా ఉన్న ఇతర ప్రాంత నాయకులు వారిని సమన్వయం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏకగ్రీవ పంచాయతీలపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మండలం గ్రామ సర్పంచ్‌ స్థానానికి వార్డులు దాఖలైన

పంచాయతీలు నామినేషన్లు నామినేషన్లు

కొణిజర్ల 27 194 254 632

రఘునాథపాలెం 37 254 308 795

వైరా 22 133 200 440

బోనకల్‌ 22 108 210 500

చింతకాని 26 161 248 626

మధిర 27 146 236 525

ఎర్రుపాలెం 31 146 284 536

మొత్తం 192 1,142 1,740 4,054

తొలి విడత జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రఘునాథపాలెం మండలంలో అత్యధికంగా 37 గ్రామపంచాయతీలు ఉండగా .. ఆయా సర్పంచ్‌ స్థానాలకు 254 నామినేషన్లు దాఖలయ్యాయి. బోనకల్‌ మండలంలో 22 గ్రామపంచాయతీలకు 108 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే రఘునాథపాలెం మండలంలో 308 వార్డు స్థానాలకు 795 నామినేషన్లు, వైరా మండలంలో 200 వార్డులుండగా 440 నామినేషన్లు దాఖలయ్యాయి.

నామినేషన్లు1
1/1

నామినేషన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement