నేటి నుంచి కొత్త వైన్స్!
● అమల్లోకి నూతన ఎకై ్సజ్ పాలసీ ● షాపుల ప్రారంభానికి వ్యాపారుల ఏర్పాట్లు
ఖమ్మంక్రైం: నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా సోమవారం నుంచి కొత్త మద్యం దుకాణాలు(వైన్స్) ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని 116 వైన్స్‌కు అక్టోబర్ 27న డ్రా తీయగా, షాప్‌లు దక్కించుకున్న వారు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసుకున్నారు. చాలాచోట్ల పాత షాప్‌ల్లోనే కొత్త వ్యాపారులు కూడా ఏర్పాటు చేయనుండగా, డిపోల నుంచి మద్యం స్టాక్ తెప్పించుకున్నారు. ఇక పాత వ్యాపారులు ఆదివారం రాత్రి వరకు అమ్మకాలు చేపట్టాక కొద్దో గొప్పో మిగిలిన స్టాక్‌ను తీసుకెళ్లారు. అయితే, జిల్లా కేంద్రంలోని పలు షాపులను జనావాసాల్లో ఏర్పాటుచేస్తున్నారని స్థానికులు అభ్యంతరం తెలపడమే కాక ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యాన వీటి ప్రారంభంపై సందిగ్ధత నెలకొంది.
రూ.కోటి వరకు బేరసారాలు
వైన్స్ నిర్వహణలో ఆరితేరిన పలువురికి ఈసారి డ్రాలో షాపులు దక్కలేదు. ఓ సిండికేట్ బాధ్యులు 160కి పైగా షాప్‌ల కోసం టెండర్లు దాఖలు చేయగా కేవలం ఎనిమిది షాపులే వచ్చాయని సమాచారం. దీంతో షాప్‌లు దక్కిన వారి నుంచి తీసుకునేందుకు రూ.కోటి వరకు ఆఫర్ చేసినట్లు తెలిసింది. దీంతో కొందరు షాప్‌లను అప్పగించగా.. ఆంధ్రా వ్యాపారులు సైతం ఉమ్మడి జిల్లా వ్యాపారులతో చేతులు కలిపి వ్యాపారంలోకి దిగుతున్నట్లు సమాచారం. ఇక నూతన ఎకై ్సజ్ పాలసీలో జిల్లా కేంద్రంలో ఈసారి లిక్కర్ మార్ట్‌ల సంఖ్య పెరగనుంది.
తొలి మాసంలోనే ఫుల్..
ఈనెలలో మూడు విడతలుగా గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వైన్స్ దక్కించుకున్న వ్యాపారులు తొలినెలలో అమ్మకాలు జోరుగా సాగుతాయనే ఆశాభావంతో ఉన్నారు. జీపీ ఎన్నికల ఫలితాల ఆధారంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ.. ఆపై మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉండడంతో వ్యాపారానికి ఢోకా ఉండదని భావిస్తున్నారు.
ఎకై ్సజ్ సిబ్బందికి తలనొప్పి
జిల్లా కేంద్రంలో వైన్స్ దక్కించుకున్న వారు ప్రారంభ ఏర్పాట్లలో నిమగ్నం కాగా, కొన్ని చోట్ల స్థానికుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. జనావాసాల్లో వైన్స్ ఏర్పాటు చేయొద్దని స్థానికులు, విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు ఆందోళనలు నిర్వహిస్తూనే అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. జెడ్పీ సెంటర్ సమీపాన జమ్మిబండ పక్కన వైన్స్ ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని కొందరు స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు సైతం మద్దతు తెలడంతో రాష్ట్ర ఎకై ్సజ్ కమిషనర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ వైన్స్ ఏర్పాటైతే ఆందోళనలు జరుగుతాయని ఇంటెలిజెన్స్ అధికారులు కూడా నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఇక్కడ షాప్ ఏర్పాటును రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించగా.. నిర్వాహకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక ఎఫ్‌సీఐ బైపాస్ రోడ్డులో కళాశాల సమీపాన, బుర్హాన్‌పురంలో కూడా వైన్స్ ఏర్పాటుపై అభ్యంతరాలు రావడంతో ఎకై ్సజ్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.


