నామినేషన్ కేంద్రాలు పరిశీలించిన అదనపు కలెక్టర్
నేలకొండపల్లి/చింతకాని/ముదిగొండ: గ్రామపంచాయతీ నామినేషన్ల స్వీకరణ, పరిశీలన కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ డాక్టర్.పి.శ్రీజ పర్యవేక్షించారు. నేలకొండపల్లి మండలం నేలకొండపల్లి, కోనాయిగూడెం, రాజేశ్వరపురంలో నామినేషన్ల స్వీకరణను ఆదివారం పరిశీలించిన ఆమె ఉద్యోగులకు సూచనలు చేశారు. అలాగే, చింతకాని మండలం నాగులవంచలో నామినేషన్ల పరిశీలనను పర్యవేక్షించిన శ్రీజ.. ప్రతీ నామినేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఇక నేలకొండపల్లి మండలంలోని పలు కేంద్రాల్లో అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఎంపీడీఓలు ఎం.ఎర్రయ్య, శ్రీనివాసరావు, తహసీల్దార్, వి.వెంకటేశ్వర్లు, ఎంపీఓ సీ.హెచ్.శివ తదితరులు పాల్గొన్నారు. ముదిగొండ మండలంలోని వెంకటాపురంలోని నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని కూడా అదనపు కలెక్టర్ శ్రీజ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఎంపీడీఓ శ్రీధర్‌స్వామిని ఆదేశించారు.
నామినేషన్ కేంద్రాలు పరిశీలించిన అదనపు కలెక్టర్


