108 సిబ్బందికి శిక్షణ
ఖమంవైద్యవిభాగం: జిల్లాలోని 108 వాహనాల్లో విధులు నిర్వర్తించే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(ఈఎంటీ)లకు శిక్షణ ఇస్తున్నారు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు వారం పాటు కొనగనున్నాయి. హైదరాబాద్ జీవీకే, ఈఎంఆర్‌ఐకి చెందిన ట్రెయినర్ పార్వతమ్మ చికిత్స విధానాలు, సత్వర స్పందన తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. తొలిరోజైన ఆదివారం ఈఎంటీలకు సీపీఆర్‌పై శిక్షణ ఇవ్వగా జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ శివకుమార్, జిల్లా కోఆర్డినేటర్లు దుర్గాప్రసాద్, సతీష్, మహేష్, మనోహర్ పాల్గొన్నారు.


