నామినేషన్ కేంద్రాల్లో పరిశీలన
కొణిజర్ల/వైరారూరల్/బోనకల్/చింతకాని: కొణిజర్ల మండలంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఖర్తడే కాళీచరణ్ సుధామరావు, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ శనివారం పరిశీలించారు. కొణిజర్ల మండలంలోని అమ్మపాలెంలో సుధామరావు, కొణిజర్లలో అదనపు కలెక్టర్ శ్రీజ వివరాలు ఆరా తీసి, నామినేషన్లను ఎప్పటికప్పుడు టీ పోల్ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. అలాగే, వైరా మండలం రెబ్బవరంలో కూడా అదనపు కలెక్టర్ పర్యటించగా ఎంపీఓ రాజేశ్వరి పాల్గొన్నారు. ఇక కొణిజర్ల మండలం తనికెళ్ల, అమ్మపాలెం, కొణిజర్లలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను అడిషనల్ డీసీపీ ప్రసాదరావు తనిఖీ చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షించాలని సూచించారు. ఎస్‌ఐ సూరజ్, సిబ్బంది పాల్గొన్నారు. బోనకల్‌లోని నామినేషన్ల కేంద్రాన్ని డీపీఓ ఆశాలత, చింతకాని మండలం రామకృష్ణాపురంలోని కేంద్రాన్ని ఏసీపీ వసుంధర యాదవ్ పరిశీలించారు.


