●మంగ్యాతండా : భార్గవి
రఘునాథపాలెం: మండలంలోని మంగ్యాతండా గ్రామపంచాయతీ పాలకవర్గం మరోమారు ఏకగ్రీవం కానుంది. సర్పంచ్ పదవితో పాటు ఆరు వార్డు సభ్యుల పదవులకు గడువు ముగిసే సమయానికి ఒక్కో నామినేషనే దాఖలైంది. గత ఎన్నికల్లో ఈ గ్రామసర్పంచ్‌గా మత్రు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆతర్వాత రెండేళ్ల క్రితం ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణ బాధ్యతలు బాల్‌సింగ్ చేపట్టగా, ఆయన కుమార్తె మాలోతు భార్గవిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ముందుగానే నిర్ణయించినట్లు తెలిసింది. ఈమేరకు కాంగ్రెస్ బలపర్చిన భార్గవి నామినేషన్ దాఖలు చేయగా మరెవరూ ముందుకు రాలేదని సమాచారం. ఆరు వార్డులకు గాను నాలుగు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు చొప్పున వార్డుస్థానాలు తీసుకుని ఒక్కొక్కరే నామినేషన్లు దాఖలు చేయడంతో పాలకవర్గమంతా ఏకగ్రీవమైనట్లయింది.


