మాస్‌లైన్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలి
ఖమ్మంరూరల్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో మాస్‌లైన్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రజా ఉద్యమాలకు చేయూతనివ్వాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు. మండలంలోని ఎం.వెంకటాయపాలెంలో శనివారం జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. విప్లవ, కమ్యూనిస్టు పార్టీలు బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే ప్రజా ఉద్యమాలు బలపడి, సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఇదేసమయాన పాలక పార్టీల జిమ్మిక్కులు, ప్రలోభాలను తిప్పికొట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించగా, కేంద్ర ప్రభుత్వం ఫాసిస్ట్ పాలన సాగిస్తోందని ఆరోపించారు. నాయకులు గోకినేపల్లి వెంకటేశ్వర్లు, మలీదు నాగేశ్వరరావు, శ్రీనివాస్, కుర్రా వెంకన్న, గుర్రం అచ్చయ్య, మందటి సంధ్యారాణి, తోట పెద్దఅప్పారావు, పుచ్చకాయల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


