ఖమ్మం వాసికి డాక్టరేట్
ఖమ్మంసహకారనగర్: ఖమ్మంకు చెందిన దైద విజయ్‌ప్రకాష్‌కుకాకతీ య విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ లభించింది. ‘వాయి సెస్ ఆఫ్‌ది అన్ హెర్డ్: ఏ కల్చరల్ అప్రోచ్ టు రూడి వీబ్ సెలెక్ట్ నావెల్స్’ అంశంపై ఆయన కేయూఆంగ్ల విభాగాధిపతిడాక్టర్ ఆర్.మేఘనా రావు పర్యవేక్షణలో సమర్పించిన పరిశోధనా పత్రానికి డాక్టరేట్‌ప్రకటించారు.విజయప్రకాష్ ప్రస్తుతం కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయంలోఆంగ్లంశాఖాధిపతిగా, ప్రజా సం బంధాల అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
రేపు అండర్–17
క్రికెట్ జట్టు ఎంపిక
ఖమ్మంస్పోర్ట్స్: అండర్–17 విభాగంలో ఉమ్మ డి జిల్లాస్థాయి బాలికల క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు సోమవారం నిర్వహిస్తున్నట్లు పాఠశాలల క్రీడల కార్యదర్శులు వి.నరేశ్‌కుమార్, వై. రామారావు తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు పోటీలు మొదలవుతాయని వెల్లడించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదుతున్న విద్యార్థినులు కూడా అర్హులేనని, ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు.
బీజేపీ జిల్లా ఇన్‌చార్జిగా మహిపాల్‌రెడ్డి
ఖమ్మంమామిళ్లగూడెం: బీజేపీ ఖమ్మం జిల్లా ఇన్‌చార్జిగా హైదరాబాద్‌కు చెందిన బద్ధం మహిపాల్ రెడ్డినియమితులయ్యారు. ఈమేరకు జిల్లాల వారీ గా పార్టీ ఇన్‌చార్జ్‌ల పేర్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతమ్‌రావు శనివారం విడుదల చేశా రు. ఇందులో భాగంగా మహిపాల్‌రెడ్డిని ఖమ్మం ఇన్‌చార్జ్‌గా నియమించారు. అలాగే, ఖమ్మానికి చెందిన కొండపల్లి శ్రీధర్‌రెడ్డికి వరంగల్ జిల్లా, సన్నె ఉదయ్‌ప్రతాప్‌ను నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్‌లుగా నియమించినట్లు వెల్లడించారు.
అల్లర్ల నియంత్రణపై శిక్షణ
వైరా/ఏన్కూరు/సత్తుపల్లిటౌన్: గ్రామపంచా యతీ ఎన్నికల నేపథ్యాన పోలీసులు బందోబస్తుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా నే పలు పోలీస్ స్టేషన్లలో సిబ్బందికి శనివారం మాక్‌డ్రిల్ ద్వారా శిక్షణ ఇచ్చారు. గుంపులుగా వచ్చే వారిని గుర్తించి అడ్డుకోవడం, లాఠీ ఉపయోగించే విధానం, జనసమూ హాన్ని చెదరగొట్టడంపై అవగాహన కల్పించా రు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ ఉద్యోగులు సమన్వయంతో, వేగంగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, అందుకు శిక్షణ ఉపయోగపడుతుందని కల్లూరు ఏసీపీ వసుంధర్‌యాదవ్ తెలిపారు. వైరా, కల్లూరు సబ్ డివిజన్లలోని పోలీస్‌స్టేషన్లలో శిక్షణ ఇవ్వగా, ఎస్‌ఐలు పి.రామారావు, ఎన్.సంధ్య పాల్గొన్నారు.
వెదజల్లే పద్ధతితో లాభాలు..
ముదిగొండ: వరి సాగు చేసే రైతులు వెదజల్లే పద్ధతి ఎంచుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయని అధికారులు తెలిపారు. మండలంలోని గోకినేపల్లిలో ఖమ్మం రైతు శిక్షణా కేంద్రం, పీఐ ఫౌండేషన్ ఆధ్వర్యాన నేరుగా వెదజల్లే పద్ధతిపై రైతులకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ సరిత మాట్లాడుతూ.. రైతులు వరి కొయ్యలను కాల్చకుండా పొలంలో కలియదున్నా లని సూచించారు. అలాగే, వెదజల్లే పద్ధతిపై లాభా లను వివరించారు. వ్యవసాయాధికారులు అరుణకుమారి, భాస్కర్‌రావు, అరుణాజ్యోతి, పీఐ ఫౌండేషన్ ప్రతినిధులు రేష్మ, హర్ష పాల్గొన్నారు.
ఖమ్మం వాసికి డాక్టరేట్
ఖమ్మం వాసికి డాక్టరేట్


