రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
బోనకల్: మండలంలోని బ్రాహ్మణపల్లిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దామాల బాబు కుమారుడు రాకేశ్‌రాయుడు (32) ఖమ్మంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. బ్రాహ్మణపల్లి వద్ద బంక్‌లో పెట్రోల్ పోయించుకొని రోడ్డు దాటుతున్న ఆయన ద్విచక్ర వాహనాన్ని వైరా వైపునకు వెళ్లే లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాకేశ్‌ను మధిర ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
గుండెపోటుతో
కానిస్టేబుల్ మృతి
●బిడ్డ అన్నప్రాసన మరుసటిరోజే ఘటన
సత్తుపల్లిరూరల్: పెళ్లయిన చాన్నాళ్లకు సంతానం కలిగింది. సంతోషంగా బిడ్డకు అన్నప్రాసన చేయించిన మరుసటి రోజే కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందిన ఘటన ఇది. ములుగు జిల్లా కన్నా యిగూడెం మండలం కాంతనపల్లికి చెందిన నల్లబోయిన హన్మంతరావు (40) సత్తుపల్లి మండలం గంగారం బెటాలియన్‌లో 2007 నుంచి కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ సత్తుపల్లిలో నివాసం ఉంటున్నాడు. హన్మంతరావు – విజయ దంపతులకు వివాహం జరిగిన చాలాకాలానికి ఇటీవల ఆడబిడ్డ జన్మించింది. ఆ పాపకు శుక్రవారం అన్నప్రాసన చేయించి ఇంటికి వచ్చారు. రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్తున్న క్రమంలో హన్మంతరావు కుప్ప కూలి పడిపోయాడు. దీంతో ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు భావిస్తుండగా బెటాలియన్ కమాండెంట్ పెదబాబు, అధికారులు నివాళులర్పించారు.
విద్యుదాఘాతంతో
యువకుడి మృతి
●వివాహ వేడుకలో స్టేజీ తొలగిస్తుండగా ఘటన
తిరుమలాయపాలెం: వివాహ వేడుక కోసం ఏర్పా టు చేసిన స్టేజీ తొలగిస్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మండలంలోని మేడిదపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో వివాహం జరగగా స్టేజీ తొలగించేందుకు కారేపల్లి మండలం బొక్కలగడ్డతండాకు చెందిన అజ్మీరా విజయ్‌కుమార్ (24) శనివారం కూలీపనులకు వచ్చాడు. స్టేజీ సమీపాన 11 కేవీ లైన్‌ను గమనించకపోవడంతో ఇనుప పోల్ దానికి తాకగా షాక్‌కు గురయ్యాడు. సహచరులు తిరుమలాయపాలెం సీహెచ్‌సీకి తరలించేలోగా మృతిచెందినట్లు వైద్యు లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురికి తరలించారు. ఇప్పటి వరకు తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి


