ఎన్నారైకి పాస్‌బుక్ జారీ
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి వరంగల్ క్రాస్‌రోడ్డుకు చెందిన పసుపులేటి రాజగోపాల్ అమెరికాలో స్థిరపడగా.. దరఖాస్తు చేసుకున్న చాన్నాళ్ల తర్వాత ఆయనకు పట్టాదార్ పాస్ పుస్తకం అందింది. ఆయన ధరణి సైట్ అమల్లో ఉన్నప్పుడు పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నా అందలేదు. మరోమారు భూభారతి చట్టం ద్వారా మరోమారు దరఖాస్తు చేసుకున్నా తహసీల్దార్ లాగిన్‌లో నిలిచిపోగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన ఆదేశాల మేరకు ఖమ్మం రూరల్ తహసీల్దార్ పి.రాంప్రసాద్ వివరాలు పరిశీలించి రాజగోపాల్‌కు ఏదులాపురం రెవెన్యూ పరిధిలోని 51గుంటల భూమికి సంబంధించి పాస్‌బుక్ జారీ చేశారు. ఈ పాస్‌బుక్‌ను ఎన్నారై బంధువుకు శుక్రవారం అందజేశారు.


