విత్తన చట్టం ద్వారా రైతులకు మేలు
ఖమ్మంవ్యవసాయం: కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న నూతన విత్తన చట్టం ద్వారా రైతులకు నా ణ్యమైన విత్తనాలు, మొక్కలు అందుతాయని అధి కారులు తెలిపారు. చట్టం ముసాయిదాపై శుక్రవా రం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు పా ల్గొన్నారు. ఈ సందర్భంగా చట్టంలోని ముఖ్యాంశాలు అధికారులు వివరిస్తూ నాణ్యమైన విత్తనాలు అందడమే కాక నర్సరీల్లో అక్రమాలను నియంత్రించవచ్చని తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ చట్టాన్ని పార్లమెంట్‌లో అమోదంచడానికి ముందుగా అందరితో చర్చించి సలహాలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఎంవీ.మధుసూదన్, ఆత్మ పీడీ సరిత, ఏడీఏలు వాసవీరాణి, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, కరుణశ్రీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.


