●ఎన్నికల గుర్తులు ఇవే
భద్రాచలంఅర్బన్ : గ్రామ పంచాయతీ ఎన్నికల గుర్తులను ఎన్నికల అధికారులు వెల్లడించారు. సర్పంచ్ అభ్యర్థుల బ్యాలెట్ పేపర్ గులాబీరంగులో, వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్ తెలుపురంగులో ఉంటుంది.
సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు
ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్‌బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్ పేస్ట్, స్పానర్, కప్పు సాసర్, విమానం, బంతి, షటిల్, కుర్చీ, వంకాయ, బ్లాక్ బోర్డు, కొబ్బరికాయ, మామిడికాయ, సీసా, బకెట్, బుట్ట, దువ్వెన, అరటిపండు, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, క్యారెట్, గొడ్డలి, గాలి బుడగ, బిస్కట్, వేణువు, ఫోర్క్, చెంచా గుర్తులు కేటాయించారు. వీటికింద నోటా గుర్తు విధిగా ఉంటుంది.
వార్డు సభ్యుల గుర్తులు
జగ్గు, గౌను, గ్యాస్ పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, గాజు గ్లాసు, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటెనా, గరాటా, మూకుడు, కేటిల్, విల్లు–బాణం, కవరు, హాకీ బంతి, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పోస్టుడబ్బా, విద్యుత్ స్తంభం గుర్తులు ఉన్నాయి. వీటి కింద కూడా నోటా గుర్తు ఉంటుంది.
●ఎన్నికల గుర్తులు ఇవే


