రోడ్డు విస్తరణపై రగడ
● బందోబస్తు మధ్య మార్కింగ్, కూల్చివేత ● పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను రూ.వందల కోట్లతో అభివృద్ధి చేస్తుండగా మార్కెట్‌కు వచ్చే రహదారుల విస్తరణకు అధికా రులు చర్యలు చేపట్టారు. పంట ఉత్పత్తులతో వచ్చే వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా నేరుగా మార్కెట్‌లోకి వెళ్లేలా శ్రీనివాసనగర్ ఎస్‌వీ ఎం పాఠశాల నుండి ప్రకాశ్‌నగర్ మీదుగా పత్తి మార్కెట్ వరకు గోళ్లపాడు ఛానల్‌పై రోడ్డు నిర్మాణానికి ప్రణా ళిక రూపొందించారు. ఈమేరకు మా ర్కింగ్ చేస్తూ నిర్మాణాల తొలగింపు చేపట్టగా.. చిన్నగా ఉన్న రోడ్ల ను 66 అడుగులకుపైగా విస్తరిస్తే తాము ఇళ్లు కోల్పోతున్నామని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వీరికి పలు పార్టీల నాయకులు మద్దతు తెలపడంతో ఆందోళనలు జరుగుతున్నాయి.
పోలీసు బందోబస్తు మధ్య..
ఖమ్మం 17, 27, 28, 29, 30 డివిజన్లను కలుపుతూ గోళ్లపాడు ఛానల్‌పై రోడ్డు నిర్మాణానికి అధికారులు వారం రోజులుగా మార్కింగ్ చేస్తూ నిర్మాణాలను తొలగిస్తున్నారు. రెవెన్యూ, ఇర్రిగేషన్, కేఎంసీ అధి కారులు పోలీసు బందోబస్తు మధ్య పనులు చేపడుతున్నారు. ఈమేరకు స్థానికులు మార్కింగ్‌ను నిలిపివేయాలని, కూల్చివేతలు చేపట్టవద్దని ఆందోళన చేస్తుండగా సీపీఎం, బీఆర్‌ఎస్ పార్టీలు మద్దతు తెలిపాయి. కాగా, నగరంలోని ప్రధాన రహదారులే 50 అడుగులుగా ఉంటే.. ఇక్కడ 70 అడుగులుగా ఎందుకంటూ సీపీఎం నేతలు శుక్రవారం ఆందోళనకు దిగారు. పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సీపీఎం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై శనివారం సీపీఎం ఆధ్వర్యంలో కేఎంసీ కార్యాలయం ముందు ధర్నా చేయనున్నట్లు తెలిసింది. కాగా, గోళ్లపాడు చానల్ పై 66 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మానానికి అధికారులు మార్కింగ్ పూర్తి చేశారు. పేదలు ఇళ్లను నష్టపోతే డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు ఇచ్చే యోచనలో ఉన్నామని అధికారులు తెలిపారు. ఈ విషయమై సీపీఎం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ మాట్లాడుతూ చిన్న రోడ్డును 70 అడుగులకు విస్తరిస్తే పేదలఇళ్లు కోల్పోనున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి 40 అడుగులతో సరిపెట్టాని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఖమ్మంక్రైం: రోడ్డు విస్తరణ పనులను అడ్డుకున్నారనే ఫిర్యాదుతో 16మందిపై శుక్రవారం బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఖమ్మం త్రీటౌన్ సీఐ మో హన్‌బాబు తెలిపారు. సీపీఎం నాయకులు యర్రా శ్రీను, భూక్యా శ్రీను తదితరులతో పాటు పలువురు సీపీఎం, బీఆర్‌ఎస్ నాయకులపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు.


