ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నిక
ఖమ్మంక్రైం: ఉమ్మడి జిల్లాస్థాయి ఎకై ్సజ్ ఎగ్జిక్యూటివ్ నూతన కమి టీని శుక్రవారం ఎన్నుకున్నారు. ఖమ్మంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా రాం ప్రసాద్ (ఇల్లెందుసీఐ), ప్ర ధాన కార్యదర్శిగా ఎం.శేఖర్ (సత్తుపల్లి సీఐ), కోశాధికారిగా ఎం.ప్రసాద్ (పాల్వంచ సీఐ) ఉపాధ్యక్షులుగా ఎం.ప్రశాంతి (సింగరేణి సీఐ), అసోసియేట్ అధ్యక్షులుగా జె.రమేశ్ (కొత్తగూడెం ఎస్‌ఐ), జాయింట్ కార్యదర్శిగా ఎస్.రమేశ్ (నేలకొండపల్లి సీఐ), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా డి.వసంతలక్ష్మి (సింగరేణి ఎస్‌ఐ)ఎన్నికయ్యారు. అలాగే, ఈసీ మెంబర్లుగా షేక్ రెహమున్సీసా (కొత్తగూడెం ఎస్‌ఐ), ఎస్.జయశ్రీ(ఖమ్మం–1 ఎస్‌ఐ), ఎం.సాయిరాం (వైరా ఎస్‌ఐ)ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్య వర్గ బాధ్యులు ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేశ్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ఎకై ్సజ్ అధికారులు నాగేందర్‌రెడ్డి, జానయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మం ఎకై ్సజ్ స్టేషన్–1, 2 సీఐలు కృష్ణ, చంద్రమోహన్ పాల్గొన్నారు.
ఇద్దరు ఉపాధ్యాయులకు అవార్డులు
ఖమ్మంసహకారనగర్/కల్లూరురూరల్: మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా హైద రాబాద్‌లోని కీర్తి అకాడమీ ఆధ్వర్యాన వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 13 మందిని ఎంపిక చేసి హైదరాబాద్‌లో శుక్రవారం సన్మానించారు. ఇందులో ముదిగొండ, కల్లూరు మండలం పేరువంచ హైస్కూళ్ల గణిత ఉపాధ్యాయులు అవధానుల మురళీకృష్ణ, ఎండీ.మౌలానా ఉన్నారు. వీరిని టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్త, కీర్తి అకాడమీ చైర్మన్ బిందు తదితరులు సన్మానించారు.
ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నిక


