●నామినేషన్ ప్రతం నింపడం కష్టమే!
రఘునాథపాలెం/నేలకొండపల్లి: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలు నింపడానికి ఇబ్బంది పడుతున్నారు. వివరాలు నమోదు చేయడంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా తిరస్కరణకు గురవుతుందనే ఆందోళన వారిలో ఉంది. అందుకే అనుభవం కలిగి, బాగా రాయగలిగే వారిని ఎంచుకోవడమే కాక సందేహాల నివృత్తికి అధికారులను పదేపదే సంప్రదిస్తున్నారు. నేరాలు, కేసులు, ఫిక్స్‌డ్, టర్మ్ డిపాజిట్ల లెక్కలే కాక పెట్టుబడులు, నగలు, వారసత్వ సంపద, భూములు కొనుగోలు చేసిన తేదీ, విస్తీర్ణం, ప్రభుత్వ ప్రవేట్ సంస్థలలో అప్పులతో పాటు నీటి, విద్యుత్, ఆదాయం పన్ను, బకాయిలు, విద్యార్హతలు, వాణిజ్య భవనాలు విలువ నమోదు చేయాల్సి ఉంది. దీంతో ఏ వివరం దాచినా ప్రత్యర్థులు ఫిర్యాదు చేస్తారనే భయంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇక బరిలో ఎవరిని నిలపాలి, సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎవరైనా సరైన అభ్యర్థి అన్న చర్చలు గ్రామాల్లో జోరందుకున్నాయి. ప్రధాన పార్టీల నుంచి ఆశావహులు ఎక్కువగా ఉండడంతో జాబితాను హైకమాండ్‌కు పంపించి నిర్ణయాన్ని ముఖ్య నేతలకే వదిలేస్తున్నారు. నామినేషన్లు సమర్పిస్తున్న అభ్యర్థులు తొలుత ఆలయాలు, ప్రార్ధనా మందిరాల్లో పూజలు చేశాకే ముందుకు కదులుతున్నారు.
●నామినేషన్ ప్రతం నింపడం కష్టమే!


