కాంగ్రెస్ మోసాలను వివరించాలి
ఖమ్మంవైరారోడ్: అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆరో పించారు. ఈమేరకు కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మంలో శుక్రవారం జరిగిన రఘునాథపాలెం మండలం ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో కంటే ఎక్కువగా పంట సాయం అందిస్తామని చెప్పి విస్మరించడమే కాక రైతు రుణమాఫీ కూడా సక్రమంగా చేయలేదని, యూరియా సరిపడా సరఫరా చేయలేకపోయిందని విమర్శించారు. పంట నష్టపరిహారం కూడా అందించలేదని తెలిపారు. ఈమేరకు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో తీసుకెళ్లి సర్పంచ్ స్థానాలను గెలచుకోవాలని పువ్వాడ సూచించారు. కాగా, తెలంగాణ ఉద్యమ సమయాన కేసీఆర్ చేపట్టిన దీక్షకు గుర్తుగా శనివారం జరిగే దీక్ష దివస్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డీసీసీబీ, మార్కెట్ మాజీ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, గుండాల కృష్ణ, బీఆర్‌ఎస్, ఖమ్మం, రఘునాథపాలెం అధ్యక్షులు పగడాల నాగరాజు, వీరునాయక్, నాయకులు కర్నాటి కృష్ణ, మక్బూల్, ఖమర్, బచ్చు విజయ్‌కుమార్, పల్లా రాజశేఖర్, గుత్తా రవి, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్


