ముగిసిన ఫిలాటికల్ ఎగ్జిబిషన్
ఖమ్మంగాంధీచౌక్: తపాలా శాఖ ఆధ్వర్యాన ఖమ్మం డీపీఆర్సీ భవనంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఫిలాటికల్ ఎగ్జిబిషన్ శుక్రవారం ముగిసింది. ఖమ్మం, హైదరాబాద్‌లకు చెందిన నలుగురు ఫిలాటలిస్టులు 3,456 స్టాంపులను ప్రదర్శించగా, వీటిని చూసేందుకు వివిధ పాఠశాలల విద్యార్థులు బారులు దీరారు. ఈమేరకు విద్యార్థులకు క్విజ్, లెటర్ రైటింగ్, డ్రాయింగ్ అంశాల్లో పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన 34మందికి బహుమతులు అందజేశారు.అలాగే, స్టాంపులు ప్రదర్శించిన ఫిలాటలిస్టులు డాక్టర్ నరేంద్రకుమార్ సాబూ(ఖమ్మం), హైదరాబాద్‌కు చెందిన దేవేంద్రకుమార్ జైన్‌తో పాటు కేవీవీఎస్.సుధాకర్, జి.హజరతయ్య, పి.ఉపేందర్‌ను ఖమ్మం పోస్టల్ డివిజనల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి ఆధ్వర్యాన సన్మానించారు. అలాగే, కార్యక్రమ నిర్వహణకు సహకరించిన ఉమేష్‌చంద్ర, సురేష్‌రావు, అలంక్రిత, డాక్టర్ విజయకుమారి, డీఎన్‌బీ.దార, అశోక్‌కుమార్, రుద్రాన్ష్ సాబూల్, అనిల్‌రెడ్డి, దిలీప్ సాబూను అభినందించారు.


