బస్సును ఢీకొట్టి వ్యాన్ బోల్తా
సత్తుపల్లిరూరల్: వేగంగా వెళ్తున్న వ్యాన్ ఎదురుగా వచ్చిన కళాశాల విద్యార్థుల బస్సును ఢీకొట్టి బోల్తా పడింది. సత్తుపల్లి నుంచి అశ్వారావుపేట వైపు వెళ్తున్న వ్యాన్ ఎదురుగా గంగారం వైపు నుంచి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో వస్తున్న బస్సును సత్తుపల్లి మండలం తమ్మిలేరు బ్రిడ్జిపై ఢీ కొట్టట్టింది. ఈ ఘటనలో బస్సు స్వల్పంగా దెబ్బతినగా విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా, వ్యాన్ తమ్మిలేరు బ్రిడ్జిపై రెయిలింగ్ ఢీకొట్టి బోల్తా పడడంతో స్వల్పంగా గాయపడిన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు.
నాగిలిగొండలో టిప్పర్..
చింతకాని: మండలంలోని నాగిలిగొండ గ్రామ ప్రధాన రహదారిపై జాతీయ రహదారి నిర్మాణానికి మట్టి తరలించే టిప్పర్ గురువారం బోల్తా పడింది. బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో వాహనం బోల్తా పడినట్లు తెలిసింది. ఈ ఘటనలో డ్రైవర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
గాయపడిన కొంగకు చికిత్స
ఖమ్మంమయూరిసెంటర్: గాలిపటం ఎగురవేసే మాంజా దారం రెక్కలకు చుట్టుకుని గాయపడిన కొంగకు కేఎంసీ డీఆర్‌ఎఫ్ సిబ్బంది చికిత్స చేయించారు. ఖమ్మం బస్ డిపో సమీపాన మాంజా దారం తాకి గాయపడిన కొంగ చెట్టుపై వేలాడుతోంది. డీఆర్‌ఎఫ్ సిబ్బంది దారం విడిపించినా గాయం కారణంగా కొంగ ఎగురలేకపోయింది. దీంతో రాపర్తినగర్‌లోని వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాకవదిలేశారు.


